|
|
Articles: My Thoughts | మనది మహా తెలంగాణ - Site Administrator
| |
కోస్తా జిల్లాలు (సర్కారు జిల్లాలు), రాయలసీమ జిల్లాలు నిజాం ప్రభువు పాలనలోనే కొనసాగివుంటే వాటిని కూడా తెలంగాణ అనక మరేమని పిలిచివుండేవారు? అసలు 'తెలంగాణ' అంటే ఏమిటి? 'తెలుగు' వారి 'నివాసం' అనే కదా!
భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, నైజాం ప్రాంతంతో కలిసి విశాల రాష్ట్రంగా ఏర్పడడంలో ఉద్దేశ్యం తెలుగు మాట్లాడే జాతి అంతా ఒక విశాల రాష్ట్రంగా ఏర్పడాలనే కదా! మరి, విశాల రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత భాష పేరున విశాల తెలంగాణ అనో, మహా తెలంగాణ అనో, తెలుగునాడు అనో పేరు పెట్టుకొని వుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడైనా చుట్టుపక్కల కోల్పోయిన తెలుగుతావులను కలుపుకొని, తెలుగువారి సమగ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలి.
ఈనాడు భాషాప్రయుక్త రాష్ట్రాలు అవతరించిన తర్వాత అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలతో కేంద్రం, రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. కనీసం నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేంతవరకూ అయిదారేళ్ళు ఆగి, అందరూ సామరస్యంగా వుండి పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత అసాధ్యమనుకుంటే ఎవరిదారి వారు చూసుకోవచ్చు గదా! అరవై ఏళ్ళు కలిసి వున్నవాళ్ళం అయిదారేళ్ళు వుండలేమా? మనం శత్రువులం కాదు గదా! ఒకే భాషామతల్లి పిల్లలం. తెలుగు తల్లి బిడ్డలారా ఆలోచించండి.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|