|
|
Articles: TP Features | మరాఠీ- తెలుగు అనుబంధం - Site Administrator
| |
ప్రాచీన మరాఠీ, తెలుగు కవుల భావ వృత్తిలోనూ అధిక స్థాయిలో సామీప్యాలు కనబడతాయి. తెలుగులోని మహాకవి పోతనను మరాఠీలోని జ్ఞానదేవునితో, ప్రజాకవి యోగి వేమనను సంత్ తుకారం అబంగ్ లతో పోల్చడం విశేషం. మరాఠీ సాహిత్యానికి ఆదిగ్రంధంగా పరిగణించే `వివేకసింధు' గ్రంథాన్ని 15వ శతాబ్ద రచయిత వెంగనాటి కొండయ్య తెలుగులోకి అనువదించిన ఆధారాలున్నాయి. `దేవీ భాగవతం' ఆంధ్రానువాదం చేసిన శ్రీదాస్ రాములు స్వయంగా తెలుగువారేనని పేర్కొన్నాడు. మరాఠీ భాషకు మోడీ లిపిని అందించిన కవి హేమాద్రి తెలుగువాడు. ఆయన చేతనే మహారాష్ట్రలో హేమాడపంతి వాస్తుకళ ప్రవేశం జర్గిందని ఆధారాలు చూపుతున్నాయి. తంజావూరు మరాఠీ రాజు శహాజీ బోస్లే, సర్షోజీ బోస్లే, తుకోజీ, ఎకోజీ బోస్లే తెలుగులోనే అభిజాత్య సాహిత్యం రచించారు.
కొమర్రాజు లక్ష్మణరావు గురించి ఇక చెప్పనక్కరలేదు. ఆయన రాసిన లేఖలు తిలక్ నడిపిన కేసరిలో ప్రచురితం అయ్యేవి. శివాజీ చరిత్రను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే. `ఆంద్ర విజ్ఞాన సర్వస్వం' శబ్దకోశం కొమర్రాజు లక్ష్మణరావు ప్రసిద్ధ గ్రంధం. దాని ప్రేరణతోనే మరాఠీలో 1914లో కేత్కర్ మరాఠీలో జ్ఞానకోశాన్ని రాయగలిగాడు. మరాఠీ - తెలుగు రెండింటి జ్ఞానకోశాల ఉత్పాదకత్వాల సంబంధాల గురించి సుప్రసిద్ధ మరాఠీ చరిత్ర పరిశోధకుడు వై.డి.ఫడ్కే రాసిన `కేత్కర్ లేఖా సంగ్రహం' ద్వారా ఎన్నో వాస్తవాలు తెలుస్తున్నాయి.
బ్రిటిష్ వారి కాలంలో నిజాం రాజ్యంగా పేరొందిన పాలనలో మహారాష్ట్ర మరాఠ్వాడాలోని జిల్లాలు, తెలంగాణతో కలిసి ఉండేవి. స్వభాషపై అభిమానంతో మరాఠీ సాహిత్యపరులు 1931లో హైదరాబాద్ లో ఒక మరాఠీ సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. దానికి అధ్యక్షునిగా కేత్కర్ ను ఎన్నుకొన్నారు. ఉర్దూ, మరాఠీ భాషపై చేస్తున్న నిర్లక్ష్య, అతిక్రమణల దాడులకు వ్యతిరేకంగా డాక్టర్ కేత్కర్ ఉపన్యసించారు. అంతకు పూర్వమే 1848-90 ప్రాంతంలో గొప్ప సాంఘిక విప్లవకారుడిగా, సామాజిక న్యాయ ఆద్యుడిగా ప్రసిద్ధి చెందిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. అదే కాలంలో ముంబయి, పుణే లాంటి నగరాలకు కూలిపనికై వచ్చి ఎదిగి ప్రసిద్ధ భవన నిర్మాణ కాంట్రాక్టుదారులుగా ఎంతో నైపుణ్యాలు సంపాదించి బ్రిటిష్ పాలకుల చేత ఎందరో, ఎన్నో అగ్రస్థాయి బిరుదులు పొందిన ఖ్యాతి తెలుగువారిది. ఎక్కువ స్థాయిలో వీరు తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన బడుగు బలహీనవర్గాల వృత్తి కులాల వారు. దాదాపు వీరిదే పూర్తి ఆధిపత్యం భవన నిర్మాణాలు, రోడ్లు, కాల్వలు, రైళ్ళ పనులు, బ్రిడ్జీలు, కోటలపై ఉండేది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|