|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
ప్రస్తుత సభ్య సమాజంలో చాలా మంది బ్రాందీ తాగడం, వ్యభిచరించడం, జూదమాడడం, లంచాలు పుచ్చుకుని సంపాదనను పెంచుకుంటూ... పదిమందిలోనూ పెద్దమనుషులుగా చెలామణీ అవడం మొదలెట్టారు. ఇలాగే కొంతకాలం సాగితే... చీకటిలోకి ప్రయాణం చేసుకుంటూ పోతే... మన జాతి నీరసించిపోతుంది. నీరసించిన జాతి చచ్చిపోతుంది. మంచిని అలవరచుకోవడం చాలా కష్టంగా ఉండి ముళ్లప్రాయంగా ఉంటుంది. ఒప్పుకుంటున్నాను. త్రాగుడులోనూ - జూదంలోనూ, ప్రతి చెడ్డపనిలోనూ చాలా సుఖం ఉంటుంది! కాని.. పర్యవసానం మాత్రం చాలా దుఃఖప్రదమౌతుంది. పైకి మృదువుగానూ పువ్వులు పరిచినట్లుగానూ కనిపించే ఈ దారి గుండా ప్రయాణిస్తే చివరికి చేరేది నరకానికే! అటువంటి దారుల గుండా సమాజం వేసే ప్రతి అడుగూ ఒక్కొక్క పిడుగుపాటై భావితరం భవిష్యత్తును భగ్నం చేస్తుంది. దీపశిఖల వైపు వెళ్లే శలభాల్లా, పూలదారి గుండా నరకానికి ప్రయాణ సన్నద్ధులౌతున్న మూర్ఖుల్లో - ఇడుగో - ఈ చంచలరావు ఒకడు.
[స్టేజి మీద లైట్లు వెలుగుతాయి. ప్రయోక్త అలాగే ఉంటుంది. చంచలరావు తన కుర్చీలో టేబులుకెదురుగా కూచుని ఉంటాడు. చంచలరావు సిగరెట్టు తీసి అంటించుకుని చాలా తన్మయత్వంతో పొగ వదుల్తూంటాడు.]
చంచలరావ్! నువ్వు సిగరెట్టు కాలుస్తున్నావు. ఆ పొగ తాగడంలో గల తియ్యని అనుభూతిని పొందుతున్నావు. కాని, నీ వెనుకనే ప్రయాణం చేద్దామని, నీ అడుగుజాడల్లో నడుద్దామని, నీ నీడలో బ్రతుకుతూ, నీ చర్యలను పరికించే ఆ కళ్లను నువ్వు చూడలేవు. చిన్నారి గూఢచారులున్నారు జాగ్రత్త!
(చంచలరావు ఏడేళ్ల కొడుకు చంద్రం వెనుకనున్న తన గది గుమ్మం తెరను తొలగించి మెల్లిగా చంచలరావు చేసే పనిని చూస్తున్నాడు. మళ్లీ లోనికి దాక్కుంటాడు.
చంచలరావు లేచి గదంతా పచార్లు చేస్తుంటాడు. చేతిలోని సిగరెట్టును నేలపై పారేసి నలిపేస్తాడు.)
ఎందుకూ ఆదుర్దా? ఓహ్! మొదటిసారి చేస్తున్న చెడ్డపని కదూ?
(చంచలరావు వీధి గుమ్మం దాకా వెళ్లి బయటకు తొంగిచూసి నిస్పృహగా లోనికొస్తాడు.)
సిల్ : ఓహ్! రావలసిన వ్యక్తి ఇంకా రాలేదని గుమ్మం దాకా వెళ్లి చూసొస్తున్నావా? నీ అవసరమున్న వ్యక్తి నీ దగ్గరకి రాకేం చేస్తాడులే?!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|