|
|
Articles: Short Stories | ఓ భర్త కథ - Mr. Pratap Cherukuri Pratap
| |
ఆఫీసుకు సూపర్నెంట్ అయిన సుబ్బారావు ప్రతీ రోజూ గంట లేటుగా రావడం గమనించిన మేనేజర్ వ్యాఘేశ్వర రావు అతనికి క్లాసు పీకాలని నిర్ణయించుకొని అతనిని ఒక రోజు ఉదయం కేబిన్ కు పిలిచాడు.
`ఏమయ్యా! సుబ్బారావు? ఏమిటి సంగతి... రెండు నెలలుగా గమనిస్తున్నాను, ప్రతీ రోజూ గంట లేటుగా వస్తున్నావు. సూపర్నెంట్ అయి వుండి లేటుగా రావడానికి సిగ్గులేదూ! నిన్ను చూసి మిగతా స్టాఫ్ కూడా లేటుగా రావడం మొదలెడితే నా పరిస్థితి ఏమిటి? రేపట్నుంచి ఒక్క రోజైనా లేటుగా వచ్చావంటే చార్జి మెమొ ఇచ్చి సస్పెండు చేస్తాను జాగ్రత్త' అంటూ పెద్దవైన తన మీసాలు మెలేస్తూ పులిలా గాండ్రించాడు వ్యాఘేశ్వర రావు'
`ఎప్పుడూ సాఫ్ట్ గా మాట్లాడుతూ, మీసాలు మెలెయ్యడమే తప్ప సీరియస్ గా ఉండని బాస్ ఈ రోజు మెమో, సస్పెండు అంటూ రెచ్చిపోవడం తో బిత్తర పడిపోయి కళ్ళ నీళ్ళ పర్యంతరమై ‘సార్, వయసులో పెద్దవాడిని, గంపెడు సంతానంతో సంసార సాగరాన్ని ఎంతో కష్టపడి ఈదుతున్న వాడిని, కాస్త కనికరించండి సార్, ఇటువంటి తప్పు ఇక ముందు చేయను' అంటూ కాళ్ళా వేళ్ళా పడ్డాడు సుబ్బారావు.
`ఏమిటోనయ్యా మీ ఉద్యోగులు, అందితే జుత్తు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు, అది సరే గాని, ఎందుకు ప్రతీ రోజూ లేటుగా వస్తున్నావో చెప్పు' ఆసక్తిగా అడిగాడు మరొక్క సారి తన మీసాలను మెలేస్తూ వ్యాఘేశ్వర రావు.
`ఏం చెప్పను సార్. నా కష్టాలు ఈ భూప్రపంచం మొత్తం మీద ఎవరికీ వుండవేమో! గవర్నమెంటు ఉద్యోగం చూపించి ఎక్కువ కట్నం వచ్చే సంబంధం చూసి మరీ పెళ్ళి చేసుకున్నాను సార్! ఆ రోజు నుండే నా కష్టాలు మొదలయ్యాయి. ప్రోద్దున్నే నాలుగు గంటలకు లేవడం, డికాషను పెట్టడం, బట్టలు వుతకడం, ఇల్లు వూడవడం, కాఫీ టిఫెన్లు, వంట పూర్తి చేసి , పిల్లగాళ్ళను నిద్ర లేపడం, వాళ్ళకు స్నానాలు చేయించి వాళ్ళ బాక్సులు సర్ధి స్కూలుకు తయారు చెయ్యడం, స్కూటర్ పై స్కూలుకు దించి రావడం, నా ఆఫీసు బాక్సు సర్ధుకోవడం లాంటి చిన్న చిన్న పన్లన్నింటినీ నేనే చెయ్యాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|