|
|
Articles: Short Stories | ఓ భర్త కథ - Mr. Pratap Cherukuri Pratap
| |
తొమ్మిది గంటలకు మా ఆవిడ నిద్ర లేచాక, పేస్టు, బ్రష్ లను అందించడం, కాఫీ, టిఫిన్లు నోటికి ఇవ్వడం, స్నానానికి నీళ్ళు పట్టడం కూడా నేనే చెయ్యాలి సార్. అప్పుడు బయలుదేరితే కరెక్ట్ టైముకు ఆఫీసుకు చేరుకుంటాను. ఈ మధ్య నా ప్రాణానికి నా మరదలు పిల్లలతో దిగింది. ఆవిడ కూడా మా ఆవిడ టైపే. విప్పిన చీర కూడా మడత పెట్టదు. లంగాలతో సహా నేనే వుతికి ఆరెయ్యాలి. పైగా రోజుకో వెరైటీ వంటకం నేర్చుకొని చేయకపోతే వాళ్ళు అసలు మెతుకు ముట్టరు, నా బ్రతుకు బస్టాండు చేసేస్తారు. పొద్దున మూడు గంటలకు లేచినా పనులకు టైము సరిపోవడం లేదు. అందుకే ఆఫీసుకు లేటుగా వస్తున్నాను. కాస్త కనికరించండి సార్!' అంటూ మొత్తం స్టొరీ అంతా గుక్క తిప్పుకోకుండా ప్రొఫెషనల్ సినీ కధా రచయిత లాగ చెప్పుకొచ్చాడు సుబ్బారావు.
మొత్తం వినేసరికి కళ్ళు తిరిగి మైండు బ్లాకయ్యినట్లనిపించింది వ్యాఘేశ్వర రావుకు.
కళ్ళు, ముక్కు లను షర్టుతో తుడిచేసుకొని అమాంతం సుబ్బారావును కౌగిలించేసుకొని `ఎంతటి విషాద గాధయ్యా నీది. నీదే కాదు ఈ దేశం లో కట్నానికి కక్కూర్తి పడి బోలెడు మంచి సంబంధాలను రిజెక్ట్ చేసేసి ఆఖరుకి తనకు తగని వారిని పెళ్ళి చేసుకునే మగాళ్లందరిదీ ఇదే పరిస్థితి. కట్నం కోసం ఆశ పడినందుకు పెళ్ళయ్యాక పనిమనిషుల్లా మారిపోతారు. కానీ ఏం చేస్తాం. నీటిలో కి దూకాక ఈదక తప్పదు కదా. అలా అని పూర్తిగా మునిగిన తర్వాత తేలడానికే ప్రయత్నం చెయ్యాలి. గుండె చేత బట్టుకొని ధైర్యం గా కార్గిల్ యుద్ధం చేసిన సైనికుడలా నీ జీవిత సమరాన్ని సాగించు. బెస్టాఫ్ లక్. నీ కోసం స్పెషల్ గా ఒక గంట పర్మిషన్ ఇస్తున్నాను. కానీ నా కోసం కూడా కనీసం రెండు రోజుల కొకసారి క్యారియర్ తీసుకు రావాలి సుమా! ప్రతీ రోజూ రుచి పచీ లేని ఆ దిక్కు మాలిన తిండి తిని నా నాలిక బండ బారి పోయింది. అలాగే ప్రతీ ఆదివారం వచ్చి మా బొచ్చు కుక్కపిల్లకు షాంపూ తో శుభ్రం గా స్నానం చేయించాలి. దానికి సేవ చేయలేక చస్తున్నాను' అని కండిషన్లతో కూడిన పర్మిషన్ ఇచ్చి దీర్ఘంగా శ్వాస తీసాడు వ్యాఘేశ్వర రావు.
ఇంట్లో పెళ్ళాం పిల్లలకు చేసే సేవ కాక ఈ ఆఫీసరు వెధవకు కూడా సేవ చేయాల్సి వస్తోంది. కానీ ఏం చేస్తాం. రోజు కొక గంట పర్మిషన్ కోసం ఈ పాట్లు తప్పవు కదా, బ్రతుకు జీవుడా అనుకుంటూ ఈ రోజు ఇంట్లో చేయాల్సిన పనులను నెమరు వెసుకుంటూ కేబిన్ నుండి బయటపడ్డాడు సుబ్బారావు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|