|
|
Articles: Short Stories | బ్రహ్మచారి బాగోతం - Mr. Pratap Cherukuri Pratap
| |
వందో పెళ్ళి చూపులకు ఎంతో ట్రిం గా తయారయ్యి శోభనరావు నా హృదయం లో నిదురించే చెలీ అంటూ ఆరాధన సినిమా లోని పాటను హం చేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వంట్లో బాగోలేదని అతని తల్లిదండ్రులు కావాలనే రావడం మానేసారు. కాఫీ, టిఫెన్లు పూర్తయ్యాక పిల్లను తీసుకురండి అని హుకుం జారీ చేసాడు. మన వాడిలో వెరైటీ ఏమిటంటే మొదటి పెళ్ళి చూపులో ఎంత హుషారుగా వున్నాడో, వందో పెళ్ళి చూపులో కూడా అదే హుషారు. డిప్రెషెన్ లోకి ఎలా వెళ్ళకూడదో మన శోభనరావును చూసే తెలుసుకోవాలి.
అమ్మాయిని ఒక పాట పాడమనండి అని పాత డైలాగే రిపీట్ చేసాడు శోభనరావు.
`అబ్బాయిగారూ. మా అమ్మాయికి పాటలు పాడడం చాలా బాగా వచ్చు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం భాషలే కాక హిందీ, పంజాబీ, భోజ్ పురి, అరబ్బీ , పార్శీ లలో కూడా అద్భుతం గా పాడుతుంది. అయితే శాస్త్రీయ కుటుంబం లో పెరిగింది కావున ఎక్కడా స్టేజి ఎక్కి పాడలేదు. పైగా మా అమ్మాయికి సిగ్గు పాళ్ళు బాగా ఎక్కువ. కనుక మీరేమీ అనుకోనంటే కర్టెన్ వెనక్కి వెళ్ళి పాడుతుంది' అని అభ్యర్ధించాడు పెళ్ళికూతురు తండ్రి ఎ వి ఎస్.
'దానికే భాగ్యం, అమ్మాయి సుశీలలా పాడాలి గాని తెర వెనుక పాడితే ప్రాబ్లం ఏమిటి. ఒక మంచి ఓల్డ్ మెలోడీ అందుకోమనండి' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శోభనరావు.
పెళ్ళికూతురు కర్టెన్ వెనుకకి వెళ్ళిపోయింది. కొద్ది సెకన్లలోనే రాధకు నీవేరా ప్రాణం అంటూ పాట మొదలయ్యింది. కంఠం సింప్లీ సూపెర్బ్. శృతి తప్పడం లేదు. ఇళయరాజా మార్కు కంపోజింగ్ లా అనిపించింది. కళ్ళు మూసుకొని పాటని ఆస్వాదించసాగాడు శోభనరావు. కలలో సీను ఊటీకి షిఫ్ట్ అయ్యింది. కృష్ణుడిగా తాను వేణువు వాయిస్తుంటే రాధలా ఆ అమ్మాయి తనపై పువ్వుల జల్లు కురిపిస్తూ డాన్స్ చేస్తోంది. వెనుక ఒక ఇరవై మంది డాన్సర్లు లయ బద్ధం గా డాన్స్ చేస్తున్నారు. మధ్య మధ్యలో యాపిల్, బొత్తాయి వంటి పళ్ళు వచ్చి ఆమె నాభి ప్రదేశాన్ని తాకుతున్నాయి. చుట్టూ వున్న స్టీలు బిందెలను హీరోయిన్ సుతి మెత్తగా తంతోంది. రాఘవేంద్ర రావు మార్కు సీను మెదులుతుండగా పాట పూర్తయ్యింది.
`వారెవ్వా!, సూపర్బ్, ఎక్స్ లెంట్, బఢియా, షుకూర్, క్యా గానా హై' అంటూ పెద్దగా చప్పట్లు కొట్టి తన అభినందనలు తెలియజేసాడు శోభనరావు. ఆ మరుక్షణమే `ఇంటికి వెళ్ళాక మా నిర్ణయాన్ని తెలియజేస్తాం' అన్న రొటీన్ డైలాగులు చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సమ్మతి కూడా ఇచ్చేసాడు.
అందరి హృదయాలూ ఆనందంతో పొంగిపోయాయి. ఆ అమ్మాయి సిగ్గుతో తుర్రున లోపలికి పారిపోయింది. బ్రహ్మానందం తనకొచ్చే సంభావనను ఎలా ఖర్చు పెట్టాలో అప్పటికప్పుడే ఆలోచించేసుకున్నాడు. శోభనరావైతే నేల మీద నిలబడడం మానేసాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|