|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
`ఏవిదీ! దెష్టమేగిం! అప్పుడు మెరుపేంటి? ఇప్పుడు ఉరుమేటి? ఏ గడబిడా లేకండ, ఈ పాటికి సల్లగా కురిసీవలసింది... ఇందాక చినుకులేనా ఉండీవి... ఇప్పుడు తుంపర్లేనా లేవు...ఏం కాలం దాపురిస్తాదో ఏటో...' అనుకుంటూ
పాపన్న : అవునోయి బావా - అవునోయి బావా
సదువుకున్నోడు కన్న ... సాకలోడు మేలన్నరు
ఉగాదినాడు సెప్పినావు - ఊసుబోని పంచాంగం
కురిసెస్తది మేగిమూ - కరిసెస్తది మేగమని
వర్షాలు కురిసీసి ఈ యేడు - పంటలు పండేస్తయని
సినుకు లేదు సిట్రలేదు - సింపీ మీ పంచాగం
సూరప్ప : అలాగడుగన్న - అలాగలాగడుగు
ఊసుబోని ఉజ్జోగం - పంచాంగం, పజ్జాలు
మినిస్టర్లనింటికి - తీసుకొస్తాడు గొప్పకి
ఎమ్మెల్యే మావోడని - చెబుతాడు గొప్పలు
ఆనకట్టు విషయము - అడిగినాడ ఎప్పుడైన
చెరువులు నిండితె చాలదా - ఆకసం సూడ్డమేల?
అడుగడుగోరన్న - ఇలాగడుగు ఇలాగడుగు
సూరన్న : ఒసే ఒసే ఊరుకోయే - పాపమ్మా కూతురా
పంచాగం ఊసెత్తకు - పాపం చుట్టుకుంటాది
ప్రెజలూ పాపాత్ములైతే - పంచాంగం పై నేడుపేల
మినిష్టరు మనోడైతే - పనులకు మనీ ఉండక్కర్లేదా
ఎమ్మెల్యే మనోడైతే - ఏటిల పడిపోమంటవేటి
పాపం మాటలేల - పాపమ్మ కూతురా
పాపన్న : ఊరుకో బావా - ఊసుపోని తగువులేటి
గంజిపొయ్యి కుండనిన్ను - గడపల తొంగోబెట్టగలదు అప్ప
వేలమించి పోలేదు - ఎటప్పా `టీ' సుక్కా
సూరన్న : పూసిన చెట్టు కాయదా
ఎత్తిన మేఘం కురవదా
దేని కాలం దానికీ - రావొద్దా? యేటి
`టీ' లేదు `గీ' లేదు - ఎల్లవోయి మీ వూరు
వర్షం కురిసీగలదు - గెడ్డలడ్డు రాగలవు
ఏలాపాళా లేదేటి - ఎకిసెక్కాలాడ్డాన్కి
పాపన్న : ఓయ! బావా! వాకిట్లో ఎవుడో కూకున్నాడు. ఏం పనిమీద వచ్చినాడో! అడుగు...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|