|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
పాపన్న : కారిమడి మన్నులోన - ఏటికలిపనావు బావ
కత్తువతో పోటు పొడిచి - మన్నుతీసి మూజూస్తే
ఖర్జూరం పండు ముద్ద - కలిపినట్టుగుంది మడిల
తీపి వాసనేస్తంది మన్ను - తినాలని అనిపిస్తుంది.
అమాస నాడు వండిన అరిసెలు పోససినావ
ఉగాదినాడు వండిన - బూరెలు పోసీసినావ
మడిలోన సారమేటి - అలాగ వాసనేస్తన్నది
గెడ్డోరమడికి సారం - గట్టిగ ఎక్కించినావు
ఏం గింజలు చల్లుతావు - ఎంత పంట తీస్తావు?
సూరన్న : ఇంటిగెత్తం పెంట గెత్తం - ఇనుమార్లు ముమ్మార్లుపోసి
చిక్కుడు జాతి రొడ్డలు - కత్తిరించి వేసినాను
పశువు పేడ కుమ్మరించి - అడుగులోతు దున్నినాను
ఎర్రబురద నీరు కట్టి - సెనగతొక్క వూరేసినాను
ఏడు రోజులారగట్టి - సారం వడగట్టినాను
చెల్లిలి పెళ్ళిచేసి - నీకిచ్చినాను ఎకరము
పెద్ద కూతురు పెళ్ళిజేసి - అల్లుడికొక ఎకరము
ఐదెకరాలమ్మినాను - పెద్దోడి చదువుకి
పురుడూ పున్నేలకి - కుదువబెట్టినాను కొంత
ఉన్న రెండు మళ్ళనూ - దున్నాలా? వద్దా
పిడికిడు మదుపెట్టీ - గరిసెడు పండించాల గంద
సత్తువ చేసీ పొలమును - సిద్దం చేసుంచినాను బావా
చిటపట కురిసిన చినుకులు - పల్లకుండి పోయినాయి
మేకపోతు గంభీరం - ఈ మేఘాలేంటిరొ
గొడ్డుగేదెల్లాంటి ఆగం - గొల్లే మిగిలిందిరొ
పుట్టెడు వరి విత్తనాలు - పోసినాను మట్టిలోన
పలకరించకుండా అవి - పల్లక తొంగుంటాయేటో
పాపన్న : కురువకుండ మేఘాలు - కూకుంటాయేటి బావ
మెరిసే మేఘం మెరవద - కురిసే ఆకాసం కురవద
దమ్ములు కాలం వస్తే - దబదబా కురవదా
ఏరుపూసి వుంచుతాను - దమ్మొట్టీ గలవేటిప్పుడు
నారు తెచ్చి నీకిస్తను - నాటీగలవేటిప్పుడు
వేలాపాలా కానియ్యి - గాబరేలా గీబరేల
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|