|
|
Articles: Short Stories | మంచు పూలు - Miss rajeswari rajeswarinedunuri
| |
ఎందుకంటే ఎదుటివాడి ఉన్నతిని చూసి ఏడవటం వాణ్ణి ఎలా పడగొట్టాలా అని ఎదురు చూడ్డం, అసూయా ద్వేషాలతో రగిలి పోవటం తప్ప మన ఇండియాలో ఏముంది? నడి రోడ్డుమీద పట్టపగలే హత్యలు, ఆత్మ హత్యలూ, దొంగతనాలు, దోపిడీలు, మాన భంగాలు. ఇంతేగా ? సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ అలాంటివేవీ ఉండవేమో అనిపిస్తుంది. పైగా ప్రతి ఇంటికీ సెక్యూరిటీ అలారం ఉంటుంది. అలారం మ్రోగితే చాలు, పోలీసులు రెక్కలు గట్టుకుని వాల్తారు. నిజానికి అర్ధ రాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగాలన్నా ఇక్కడ భయం ఉండదు.చేను మేసే కంచెలుండవు. ఇక్కడ స్త్రీ పురష బేధం లేదు. అందర్ని అందరూ బాగా చూస్తారు.
ముఖ్యంగా మన భారతీయులంటే మరింత గౌరవంగా ఆడైనా మగైన చిరు నవ్వుల పలకరింపుతో 'హాయి' చెప్పి విష్ చేస్తారు. మనం ఎక్కడ మాలైనా ,బీచైనా, హోటలైన , పార్కైనా. వాకింగ్లో ఐనా ఎక్కడైనా అది వారి ఆచారం కింద చక్కగా పలకరిస్తారు. అదే మన దేశంలో దగ్గర చుట్టమైన ఎంతో పరిచయమున్న మిత్రుడైన ఇష్టం లేకపోతే ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళి పోవడం పరిపాటి. ఇక్కడ ఎవరికెవరు అపరిచితులు కారు. అందరూ అందరికీ పరిచితుల్లానె విష్ చేసుకుంటూ కదలి పోతారు.
నిజం చెప్పాలంటే అమెరికాలో అడుగిడిన ప్రతి క్షణం ఒక వింత అనుభూతి. ఈ అందమైన ప్రకృతి సౌందర్యాలకా? దేశం కాని దేశం వచ్చినందుకా? ఇక్కడి ప్రజల ఆదరాభి మానాలకా? ప్చ్! ఏమో తెలియదు. ఇక్కడ అందమైన అమ్మాయిల తీరుతెన్నులు వారి జీవన విధానాలు ఈ దేశపు సంస్కృతీ సాంప్ర దాయాలు, కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కొందరు పిల్లల్ని పెద్దల్ని చూస్తుంటే షోకేసుల్లో బొమ్మలు వీళ్ళని చూసే చేసారా అన్నంత భ్రాంతి కలుగుతుంది. అంత అందంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల్ని బాగా చూస్తారు. పసి తనం నుంచీ హైస్కూలు వరకు చాలవరకు ఉచిత విద్యా విధానమే. పదహారు సంవత్సర ములు రాగానే అమ్మాయిలకు 'స్వీట్ సిక్ష్టీన్' అని గ్రాండుగ ఫంక్షను చేస్తారు (మన చిన్న సైజు పెళ్ళిలాగ). తర్వాత పద్దెనిమిది వచ్చాక ముఫై రోజులలోగా ఇంట్లోంచి పంపేస్తారు. (స్వీట్ సిక్ష్టీన్ ఆఫటర్ ధర్టి డేస్) ఇంక వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారి జీవన విధానం ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|