|
|
Articles: Short Stories | ఉంగరం - Miss rajeswari rajeswarinedunuri
| |
అబ్బో! నా ఉంగరం దొరికిందీ! అంటూ మూడు పదుల సుధ మూడేళ్ళ పిల్లలా గెంతింది.
అబ్బా! దొరికిందా! పోన్లె ఇన్ని రోజులుగా వెతుకుతున్నాం అసలే ప్రధానపుంగరం. హమ్మయ్య! దొరికిందికదా? అన్నాడు భర్త శ్రీను స్కూటరు పార్క్ చేసి లోపలి కొస్తూ.
అదేనండీ! ఈ రోజు గురువారం కదా! గుడి నుంచి వచ్చేసరికి ఖచ్చితంగా దొరుకుతుందనుకున్నాను. అంతా బాబా మహత్యం అంటూ సుధ ఉంగరంతో సహా హాల్లోకొచ్చి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అత్తగారికి, మామ గారికి, బావగారికి చూపించింది. పోనీలే మన బంగారం మంచిది దొరికింది అంతేచాలు... అంటూ అత్తగారు ఆదిలక్ష్మి ఓ సారి ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరికించి చూసి పక్కనే ఉన్న భర్తకీ, కొడుక్కి చూపించింది. సాలోచనగా వారివైపు చూస్తూ. ముగ్గురి కళ్ళల్లోను వింత మెరుపు. ఇంత మాట్లాడు కుంటున్నా అప్పుడే సందె గుమ్మాలు ఊడ్చి వంట గదిలో జొరబడిన పెద్ద కోడలు రాణి గారు ఉలుకు పలుకు లేదు సరికదా అసలు వంట గదిదాటి బయటకు రాలేదు. అన్నీ నిశితంగా గమనిస్తున్న ఆదిలక్ష్మి సుమారు ఇరవై రోజులుగా పోయిందన్న ఉంగరం ఇల్లంతా అణువణువూ దులిపి గాలించినా దొరకని ఉంగరం, అందరి బీరువాలు గాలించినా దొరకని ఉంగరం ఈ రోజు ఇంత హఠాత్తుగా అప్పుడే తుడిచిన గదిలో ఎలా దొరికిందో అర్ధంగాక ఆలోచనలో బడింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|