|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
పద్మ కష్టాలన్నీ ఎల్లంకు తెలుసు. ఇంతకుముందే మేనింజర్ కు చెప్పి చూసిండు. అతడు కుదరనే కుదరదన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పుతూ 'సూడక్కా... నీకు పర్సనల్ లోన్ ఇప్పిస్త తియ్యి. దానికి దీనికి కొద్దిగ తేడా... అంతే! సబ్సిడీ ఉండది' అన్నాడు. పద్మ అప్పటికి పూర్తిగా తేరుకుంది. ఎల్లం దిక్కు నీరసంగా చూస్తూ 'వద్దు... నాకు ఏ లోను వద్దు. ఇస్తే అదే లోను ఇయ్యిమను...' ఆమె పూర్తిగా చెప్పకముందే ఎల్లం యాష్టగా 'ఆ లోన్లు నీకు ఇయ్యరంటే ఇనత్త లేదా...? అవి రైతులకిచ్చే లోన్లు' అన్నాడు. అతడి మాటల్లో కోపం కంటే ఎక్కువ సాధికారత ఉంది. ఆమెను ఆదుకోవాలన్న ఆరాటం ఉంది. పద్మ ఇవేమీ గుర్తించలేదు. అతడు ఎలా అన్నా ఆ మాటలు మాత్రం ఆమెను నిలదీసినయి. ఎన్నో రోజులుగా మసులుతున్న ప్రశ్నను గట్టిగా అడిగింది.
'అంటే... ఎల్లమూ.... నేను రైతునే గానా..?' ఈ ప్రశ్న ఒక ఎల్లంనేగాదు. అందరినీ నిలదీసి అడిగినట్లుగా అడిగింది. అడగడం గట్టిగానే అడిగినా ఆబొబ్బలో అందరికీ వినిపించలేదు. విన్న వాళ్ళు మాత్రం అనేకరకాల చూపులతో పద్మను చూశారు. ఎల్లం మాత్రం పక్కర పక్కర నవ్వాడు. నవ్వుతూ 'రైతులంటే ఆడోళ్ళు గాదు. మొగోళ్ళు... మొగోళ్ళను రైతులంటారు...' అని మళ్ళా నవ్వాడు. తెలియని విషయమేదో తెలియజెప్పుతున్నట్టే అన్నాడు గాని ఆమె ప్రశ్నించినలోతు, ప్రశ్నలోని ఆవేదన ఎల్లంకు అందలేదు. అట్లనే నవ్వుతున్నాడు. బాధగా చూసింది పద్మ. ఒక్కసారిగా కార్యాలు కదిలినయి. యాడాది కింద ఇదే బేంకులో మేనింజర్ ఎడ్లుబండి ఎల్.టి.లోన్ కొరకు వస్తే 'నువ్వు నాగలి దున్నుతావా...? బండి కడుతావా...? ఎడ్లు బండి నీకెందుకు...?' అని ఇట్లనే నవ్వాడు.
అప్పుడు కూడా కడుపుల కార్యాలు కదిలినయి. మనసు బెక్కుమన్నది. లేచి ఇంటిమొఖం పట్టింది పద్మ. విసురుగా వెళ్ళిపోతున్న పద్మవైపు కోపంగా చూసాడు ఎల్లం. 'ఏదో ఒకలోను. ఏదైతే ఏంటిది. ఇప్పియ్యి' అంటుందనుకున్నాడు. ఆమె వద్దనేసరికి అహం దెబ్బతిన్నది. 'చిన్న నీలుగు నీలిగుడుగాదు. అందులేం లేదు.. సందెడు గోషి అన్నట్లు చెరువు అలిగి చెయ్యి కడుక్కోకపోతే ఎలవదేం పోతుంది' అంటూ పనిలో మునిగిపోయాడు ఎల్లం. నడుత్తుంటే కాళ్ళు వణుకుతున్నయి పద్మకు. లోను ఇవ్వనందుకు కాదు. తనను రైతే కాదన్నందుకు బాధగా ఉంది. ఈ బాధ ఇప్పుడు గాదు. ఇరువై ఏండ్ల కిందనే మొదలయింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|