|
|
Articles: Short Stories | సాగరయానం - Miss rajeswari rajeswarinedunuri
| |
మరొక పక్క టాటూలు వేయించుకునే వారు కొందరు, ఇంకొక వైపు స్పాకి జిమ్ముకి గోల్ఫ్ ఆటలకి స్టీం బాత్లకీ అదే సోనా అందాలకు మెరుగులు దిద్దుకోవాలని ఇలా ఎవరి హడావుడి వారిది.ఇక సాయంత్రం వరకు తిరిగి అంద మైన సూర్యాస్త మయం చూసి డిన్నరుకి వెళ్ళాము. ఈ రోజు అందరూ ఫార్మల్ డ్రస్సులో రావాలనే సరికి హాలంతా సగానికి సగం చీరెలతో నిండిపోయింది. ఈ షిప్పులో ఇంత మంది ఇండియన్స్ ఉన్నారా? అనిపించింది. డిన్నరులో అంతా మన కూరలు అవీ రైస్ తో సహా. టోనీ, లండన్ లు అడిగి అడిగి నవ్వుతూ జ్యోక్స్ చెబుతూ మాజిక్కులు చేస్తూ ముఖ్యంగా పిల్లలని మరింతగా ఆకట్టు కున్నారు. ఇక అలవాటు పడిన టోనీ మామీ ఇద్గో నీ వెన్నిళ్ళా అంటూ చెప్ప కుండానే తెచ్చి ముందుంచాడు. ఎవరివో మళ్ళీ పుట్టిన రోజు, పెళ్ళి రోజు, షష్టి పూర్తి చప్పట్లు పాటలు ఫోటోలు తీయడం హడావుడి. అనంతరం స్టాఫ్ వారి సంగీత నృత్యం, వెలిగి ఆరుతున్న రంగు రంగుల లైట్ల క్రింద వింత వింత ఆనందం. మూడవ రోజు వెదరు బాగుండక పోవడంతో కెనడా వరకు వెళ్ళటల్లేదని వెను దిరిగుతున్నందుకు సారీ అని ఎనౌన్స్ మెంటు రావడంతో కొంత నిరాశ చెందినా ఇంటికి వెళ్ళ కుండా షిప్పులోనె ఉంటాం కదా అని ఆనందించాము.
ఎందుకంటే ముఖ్యంగా ఇంటి పనీ ఒంట పనీ తో అలసిపోయిన ఆడవారికి (కొందరు మగ వారికి కుడా) పుట్టింటిని రెట్టించిన సుఖం ఉండటంతో ఎన్ని రోజులైనా హాయిగానే ఉంటుంది మరి. అందుకని ఇక మూడవ, రోజు నాలుగవ రోజు హాయిగా షిప్పు మొత్తం అన్ని అంతస్తులు చూసినవే చూసి, తిరిగినవే తిరిగి, తిన్నవే తిని చుట్టూ మబ్బులు కమ్మిన ఆకాశాన్ని, దూరంగా మసక మసకగా లైట్లతో కనబడే షిప్పులనీ చూస్తూ విశ్రాంతి గా గడిపే సరికి చివరి రోజు ఆదివారం డిన్నరు రానే వచ్చింది. డిన్నరులో మామూలు కంటే ఎక్కువ ఆదరాభి మానాలు చూపించారు టోనీ, లండన్లు. మామీ ఇదిగొ నీ వెన్నిళ్ళా అంటూ మరి కాస్త ఎక్కువ తెచ్చి నొక్కి పలికి టక్కుమని ముందుంచాడు. చివరిగా వీడుకోలు పాటతొ నృత్యం చేశారు. అప్పుడు టోనీని అడిగాము. ఈ కార్నివల్ షిప్పులో ఎంత మంది ఉంటారు? ఏమిటి? అని. 3600 గెస్టులు, 1200 స్టాఫ్, 250 వంట వాళ్ళు ఉంటామని చెప్పాడు. మరి బల్గేరియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి వచ్చామని ఆరు నెల్లకొక సారి వెడతామని, కుటుంబాలు అక్కడే ఉంటాయని తనకిద్దరు పిల్లలని చెప్పాడు. అంతా విన్నాక వీరి జీవితాలు సంద్రానికే అంకితం అనిపించింది.
మనిషికి పది డాలర్లకి తక్కువ గాకుండా టిప్పు ఇవ్వాలి. వారి ఆదరాభి మానాలకి ఆనందంతో ఎక్కువే ఇవ్వాలని పించింది. వారి నుంచి వీడ్కోలు తీసుకుని రూములకు వెళ్ళి పోయాము. మర్నాడు సోమ వారం ఉదయం పది గంటలకి న్యూయార్క్ షిప్ప్ యార్డ్ కి చేరుకున్నాము. హడ్సన్ రివర్ నుంచి అట్లాంటిక్ సముద్రంలో తిరిగిన మత్తు వదిలి పోయింది. భూతల స్వర్గం నుంచి ఇలాతల నరకం లోకొచ్చి పడినట్లైంది. మన ఇల్లు, మన పని మామూలు అనుకుంటూ ఉస్సురని నిట్టూర్చి ట్రాలీ బాగులు ఈడ్చుకుంటూ పీర్ అంతా నడిచి నీరసంగా కార్లో కూల బడ్డాము. అంత వరకు పొందిన సుందర స్వప్నం కరిగి ఒక మధుర స్మృతి గా మిగిలిపోయింది.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|