|
|
Articles: TP Features | 'చౌక'గా చంపుతాయ్! - Site Administrator
| |
తక్కువ ధరకు లభించే ఎంపీ త్రీ, మన చెవుల్లో తొమ్మిది డెసిబుల్స్ శబ్దాన్ని ఇస్తాయని చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ సర్దేశాయ్ చెబుతున్నారు. 'పరికరం నాణ్యత ఆధారంగానే శబ్దం వెలువడుతుంది. అనుమతులు ఉన్న కంపెనీలకు చెందిన పరికరాల్లో వెలువడే ధ్వని హాని చేయదు. చౌకగా వచ్చే ఇయర్ ఫోన్స్, ఎంపీ త్రీ ప్లేయర్లలో స్పష్టత లేకుండా పెద్ద ధ్వని వస్తుంది. ఎక్కువ ధ్వనితో వినడం వల్ల చెవుల్లో సున్నితమైన నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంద'ని ఆయన చెబుతున్నారు.
సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి అనుమతులు అవసరం. ముందు భాగాలను కూర్చడం ద్వారా రూపొందించే కంప్యూటర్లు, గీజర్లు వంటి వాటికి అనుమతులు అక్కరలేదు. అందుకనే కాట్ మైదాన్ వంటి చోట్ల... పుట్ట గొడుగుల్లా 'యూనిట్లు' పుట్టుకొస్తాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రొఫెసర్ రామేశ్వరరావు మాట్లాడుతూ, తక్కువ ధరకు లభించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో నియంత్రణ సంస్థలు సూచించిన విధంగా నాణ్యతా ప్రమాణాలు ఉండవన్నారు. ఎల్బీనగర్ లో సెల్ ఫోన్ ఛార్జర్ పేలిన సంఘటనలో ఒక యువకుడు మరణించిన వైనాన్ని ఆయన గుర్తుచేస్తూ నియమిత ఉష్ణోగ్రతలు దాటిన తరువాత జరిగే రసాయన చర్య పేలుడుకు దారితీస్తుందన్నారు. ఇటీవల ఒక ప్రముఖ కంపెనీ కూడా తాను విడుదల చేసిన సెల్ ఫోన్ లలో ఒక సిరీస్ ను పూర్తిగా నిషేధించిందని చెప్పారు. ఆ సిరీస్ లోని ఫోన్లు ఎక్కువగా పేలిపోవడమే కారణమని వివరించారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల వల్లే కాకుండా ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్న ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, ఇతర వస్తువుల వల్ల కూడా మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని డాక్టర్ ఎం.విజయకుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బాటిళ్ళలోని బిస్ ఫినాల్ అనే రసాయనిక పదార్థం హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఇటీవల కాలంలో వంట ఇళ్ళల్లో వినియోగం పెరిగిన నాన్ స్టిక్ (టెఫ్లాన్), అట్ల పెనం, బాణలి వినియోగం కూడా ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఈ వస్తువులకు వేడి తగిలే కొద్దీ ఆరోగ్య హానికారక అణుపుంజాలను విడుదల చేస్తాయి. ఇతరత్రా ఇబ్బందులతో పాటు పునరుత్పత్తి వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే ఈ వస్తువులపై ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయన్న చట్టబద్ధమైన హెచ్చరికలు ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|