|
|
Articles: Short Stories | నేను నా బిఏ! - Miss rajeswari rajeswarinedunuri
| |
సరే ఒకే రేపట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టు.
మీరెంత మంచివారండీ? చీపురుతో సహా మెడ చుట్టూ చేతులు బిగించాను.
ఒక వారం రోజుల తర్వాత ఎగ్జంక్షన్ ఫారం తెచ్చారు. ఇంతకీ ఏ మీడియం. సందేహం వచ్చింది. తెలుగంటే నామర్దా ఒక్కసారిగా ఇంగ్లీషంటే గుండె ఝల్లుమంది. హజ్బెండుకి హార్ట్ వైఫ్ కి ఉల్ఫ్ అని చదవడం మాట అటుంచి 'విండో' రాయడానికి విడో
రాసొచ్చే అలవాటుంది. అందుకని ఎలాగా? అని చివరికి బింకంగా ఇంగ్లీషే రాసెయ్యమన్నాను.
సరే శ్రీ వారు ఫారం అంతా ఫిలప్ చేసి [అదే తన రైటింగు బాగుంటుందన్న గర్వంతో] ఇదిగో అమ్మగారు సంతకం పెట్టండి అన్నారు.
దానికేముంది గరిట్లకీ అట్లకాడలకీ అలవాటు పడిన చెయ్యి పెన్ను పట్టుకునేసరికి కాస్త వణికినా మొత్తానికి సంతకం పెట్టాను.
కాసేపు తర్వాత చూసిన శ్రీ వారు విరగబడి నవ్వారు.
అదేమిటి? ఎందుకంత నవ్వు? ఎంతో జాగ్రత్తగా సైను చేసానుగా?
అయ్యో! కిలో పప్పు రుబ్బినట్టనుకున్నావా? 'సిగ్నేచర్' అన్నదానికి పైన సంతకం చెయ్యాలి తమరు కింద చేశారు.
ఎక్కడైతే ఏముంది? ఉక్రోషంగా అన్నాను.
అంతేలే అది చూడగానే అనుకుంటాడు. బి.ఏ. రాసే మొహం కాదని.
పోనీలెండి వాడెవడో మనకి తెలీదుగా. ఐనా నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? ఏ సంతకం ఎక్కడ చేయాలొోతెలియడానికి?
సర్లs తమరివి నాలుగు ఫుటోలు కావాలి.
నాలుగు నాలుగు రకాలు ఉన్నాయి. ఒకేలాంటివి కాకపోతేనేం? ఆ మాత్రం గుర్తుపట్టడా?
అవునవును వాడికిదే పని. మరింతకీ తమరి గ్రూపు?
నాకసలు సైన్స్ అంటే ఇష్టం. పైగా కెమిస్ట్రీ.
ఇకనేం ప్రాక్టికల్స్ మొదలుపెట్టు వంటింట్లో అదర్వైజ్ బెడ్రూం
మరీ అంత వెక్కిరించఖర్లేదు. ఊరికే చెప్పానంతే. నా మొహానికి ప్రాక్టికల్స్ కూడానా? ఏ హిస్టరీనో జాగ్రఫీనో తగలేస్తే సరి.
ఏం? వాటికేమైంది? ఇంచక్కా అన్నం తింటూ కూడా చదువుకోవచ్చును.
అవునవును. బాత్రూంలో కూడా చదువుకోవచ్చు. బుర్ర పగిలి చావను వచ్చు. ఒకడు పుట్టిన తేదీకి మరొకడు చచ్చిన తేదీని ఇంకొకడు చచ్చిన తేదీని వేరొకడు పుట్టిన తేదీని రాయచ్చు. రాజధానికి విమానాశ్రయం పెట్రోలియంకి ప్రైమ్ మినిస్టరు రాయడం మాట అటుంచి అక్బర్ కి అశోకుడు శివాజీకి కెనడీ రాసి రావచ్చు చీ...చీ ఆ సబ్జెక్ట్ అంటేనే నాకసలు వళ్ళు మంట.
అరెరే నీ వళ్ళు మండితే నా వళ్ళు మండినట్టే ఉండుండు అంటూ నాలుగు ఐసుముక్కలు తెచ్చి జాకెట్టులో వేసి మరీ అంత ఒకటో క్లాసు కాదు విమానాశ్రయం అశోకుడు అడగడానికి? ఐనా అమ్మగారికి ఆర్ట్స్ గ్రూప్ తప్ప గత్యంతరం లేదు- అంటూ ఫారం ఫిలప్ చేశారు.
ఏడుపొచ్చినా దిగమింగక చేసేదేముంది? గట్టిగా ఏడిస్తే ఇదీ ఉండదు. ఇదివరకెన్నోసార్లు చదువుతానని వాదించుకోవడమే గానీ ఇంత వరకు రాలేదు. అసలిప్పుడు మాత్రం ఈ మనిషితో నమ్మకం తక్కువే. ఫీజు కట్టకపోవచ్చు కట్టినా పరీక్ష రాయనివ్వకపోవచ్చు. రాసినా పాసవకపోవచ్చు. ఈ మైనరుకి మంచితనంతో పాటు కాస్త మనో చాంచల్యం కూడా ఉంది [చెప్పకండేం? పుస్తకాలు కొనరు అందుకని]
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|