|
|
Articles: My Thoughts | ఫెయిల్యూర్ టు సక్సెస్ - Site Administrator
| |
ఆంగ్ల మాధ్యమం పట్ల తల్లితండ్రులు మోజుపడుతుండగా, విద్యార్థులు తెలుగు మాధ్యమం పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉపాధ్యాయులు తెలుగు మాధ్యమమే శాస్త్రీయమైనదంటూ, అయినా ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతుందేమోనంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలవాళ్ళు ఇంకొక వాదన చేస్తున్నారు. 1 నుండి 5వ తరగతి వరకు అంటే ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలో చదివినవారు 6వ తరగతిలో ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని కనుక, ఆంగ్ల మాధ్యమాన్ని 1వ తరగతి నుండే ప్రవేశ పెడితే మంచిదంటున్నారు. కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా, అటు తిరిగి, ఇటు తిరిగి సక్సెస్ స్కూళ్ళ విధానం వల్ల తెలుగు మాధ్యమం ప్రాధమిక విద్యతో సహా పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కనపడుతున్నది. మొత్తం మీద సక్సెస్ స్కూళ్ళు సక్సెస్ వైపు కాకుండా ఫెయిల్యూర్ వైపు పయనిస్తున్నాయని మా పరిశీలన కూడా తేట తెల్లం చేస్తున్నది.
వీటన్నింటిని బట్టి చూస్తే ప్రపంచీకరణకు సక్సెస్ స్కూళ్ళ విధానానికి అవినాభావ సంబంధం ఉందని స్పష్టం అవుతున్నది. ప్రపంచీకరణ - ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మార్కెట్ నినాదాన్ని ప్రబోధిస్తున్నది. కనుక ప్రజలకు ఉపయోగపడే విద్యా విధానాన్ని సాధించుకోవాలంటే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని సక్సెస్ స్కూళ్ళు మన ముందుంచుతున్నాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|