|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
(ఛాయరాజ్)
నెలదినాలుగా ఆకాశం మబ్బులతో నిండి ఉంది. చినుకు రాలడంలేదు. రాత్రి 8 గంటల సమయం.
'రామ నా సెందునాలో...
రాజా నీకొందనాలో...'
రాములమ్మ పాడుతోంటే, ఆమె చుట్టూ తిరిగి వలయంగా గెంతులేస్తున్నారు గుంటలు నలుగురూ. పెద్ద కొడుకు ఆశ్చర్యార్థక (!) మంత ఉంటాడు. రెండవ వాడు ప్రశ్నార్థక (?) మంత ఉంటాడు. నడిపోడు కామా (,) లాగుంటే, చివరారకరి గుంట పులిస్టాపు (.) లాగుంటుంది. ఒక వాక్యానికి ఇన్ని గుర్తులు పెడితే, దానర్థం ఒకంతట అవగతం గాదు పండితులకు గూడా... ఏమైనా అర్థమైతే శ్రీశ్రీ లాంటి వారికే అర్థమవ్వాలా.
తాపీ పని ముగించుకొని, మేస్తిరివాటాపోనూ మిగిలిన కూలీ డబ్బులు జేబులేసుకుని, గుడిశవేపు వస్తున్నాడు సీతప్పడు. గుడిశ ముందు వాకిట్లో ఈ గెంతులు చూసి వల్లు మండిందాతడికి. 'తాపీ'తోటి వాళ్ళ చెంపల మీద ఒక్కొక్కటిచ్చుకోవాలనుకొని -
'ఓలె రావుడో... ఏమిటాగెంతులు? నువ్వు చెడిందిగాక గుంటలికి నేర్పుతున్నావు యిద్దెలు. ఈ పొద్దామాసైతే, మేగాలతోటి ఆకాసం ఒరిసిపోయి నల్లగైపోయుంటే... యెన్నెలట... యెన్నెల... పాటలు మాటకేంగాని, కడుపు మండతంది... కూడొండినావా లేదా?' అన్నాడు సీతప్పడు.
'ఓసి... పల్లకోవా... కూలికెళ్ళి ఈ పొద్దు పెందరేల గుడిశ కొచ్చీసినాను. దార్లో సెట్టికొట్లో ముతక (దొడ్డ) బియ్యం 30 రూపాయల చొప్పున రెండు కేజీలు కొనుక్కొచ్చి ఉడకేసినాను. కూర తెస్తావని చూసిచూసి, కడుపుమండి, గంటలూ నీనూ, కూడి ఆకలి పోగొట్టుకోడానికిలాగ గెంతతున్నాం. అమాసైతే... యెన్నిలొచ్చిందాక, పాట ఆగుతాదేటి?, శాన, శాన... అవును కూలిడబ్బుల్తోటి తాగీసినావేటి? అలాగ సిరసిరలాడతన్నావూ... సేతిలో తాపీ తప్ప ఏటిలేదు... ఎలాగనీతోటి...' అంది రాములమ్మ. 'గుంటల్లారా, రాండి రండర్రా...' అంటూ గుడిశలోనికెళ్ళింది. పిల్లల్లు తల్లెనక తుర్రున గుడిశలోకి పోయి, బితుకు బితుకుమని, యిరకిరకల్లోంచి అయ్యని చూస్తున్నారు బెంబేలెత్తిపోయి. ఉట్టిమీద ఉన్న సట్టిలోంచి గుప్పిడు నెత్తడి పరిగల్ని తీసి, కడిగి, మూకిడిలో సిటికెడు నూనె పోసి - అందులో వేసి పొయ్యిమీద పెట్టి, నిప్పూదింది రాములమ్మ. కూరొండలేదని అగ్గిబరాటా అయిపోతుండు సీతప్పడు. 'ఉండండి, 'ఇందిరమ్మ ఇల్లు'లోని కెలితే, అక్కడ గెంతుదురుగాని...' అంటూ పిల్లలవేపు ఉరిమిచూశాడు ఇంట్లో... ఒంట్లో బాగోలేని తాపీపనోడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|