|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
ఇంతలో - పెద్ద గుంటడు గుడిశలోకి పరుగెత్తుకొచ్చి 'ఓలమ్మా... ఓరయ్యో...ప్రయివేటు బడులన్నీ మూసీసినారంట. అదేదో 'గురితింపు' ఇవ్వలేదట. మా బడీ రేపటినుండి మూసేస్తారు గావాలా... అంటూ వాకిట్లోకి పారిపోయాడు. గుంటలందరూ వీధుల్లో చేరి గెంతుతున్నారు. ఈ చోద్యం చూద్దామని... పొయ్యి ఆర్పేసి... వాకిట్లోకొచ్చింది రాములమ్మ. పిల్లల మధ్యకెల్లి నిలబడి తానూ గెంతడం ఆరంభించింది. రాములమ్మా గుంటే. పాతికేళ్లయినా నిండలేదు అనుకున్నాడు సీతప్పడు. ' రాములమ్మ పాటందుకుంది
'రామనా సెందునాలో..
రాజా నీకొందనాలో..
'అ ఆలు నేర్పుతాది యెన్నెలో ఎన్నెలా'
ఇ ఈలు నేర్పుతాది యెన్నలో ఎన్నెలా
కలిపివేత నేర్పుతాది యెన్నలో ఎన్నిలా
తీసి వేతలు నేర్పుతాది యెన్నెలో ఎన్నిలా
'క' గుణింతం నేర్పుతాది..
ఎక్కాలు నేర్పుతాది...
గుణింతాలు నేర్చుకుంటాం
బాగారం నేర్చుకుంటాం'
ఇన్నాళ్ళబట్టి డబ్బుగట్టి, ప్రయివేటు బడిలో చేర్పిస్తే... ఒక్క ఇంగ్లీషు ముక్క పాటలో పలకరేటి గుంటలూ... అన్నన్నా... తల్లిబాస అంత గొప్పదేటి? అలాగంటున్నాది గుంటల నాలిక! అనుకున్నాడు. సీతప్పడు... ఆలోచనలో పడిపోయాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|