|
|
Articles: TP Features | ప్రాకృతంలో 'తెలుగు' నాడి - Site Administrator
| |
(ఆచార్య జయధీర్ తిరుమలరావు)
'తెలుగు మరుగులు' గ్రంథంలో పేర్కొన్న 33 ప్రాచీన తెలుగు పదాలలో చాలావరకు ప్రాకృత భాషా సంబంధంతో పండితులు అర్థం సాధించారు. ఇది చాలా పరిమిత కృషి మాత్రమే.
33 పదాలలో మొదటి పదం 'అంధక' ఒకటి. ఈ పదం క్రీస్తుపూర్వం నుండి క్రీస్తుశకం మూడు నాలుగు శతాబ్దాల వరకు వాడుకలో ఉంది. తెలుగు భాషకు, తెలుగు జాతి నివసించిన లేదా విస్తరించిన ప్రాంతానికి, తెలుగు సీమ (భూభాగం)కు 'అంధక' పదాన్ని వాడేవారు.
ఈ పదం బౌద్ధ సాహిత్యంలో చాలా సార్లు కనిపిస్తుంది. 'సుత్తనిపాతము'లోని 'పరాయన' మార్గంలో 'వత్ధుగాధ'లో ఉదహరించిన అస్సక, అళకులు, అంధక రాజులని ఉంది. అస్సక - అశమక (అశ్మక) దేశం లేదా జనపదం నిజామాబాదు పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గల బోధన్ ప్రాంతమే. చరిత్రకారులు చాలా మంది అంగీకరించిన విషయమే ఇది. ఈ జనపదాలకు పది కిలోమీటర్ల దూరంలో మంజీరానది, పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గోదావరి నది, పదహారు కిలోమీటర్ల దూరంలో హరిద్రానది ఉన్నాయి. నిజానికి ఈ పరీవాహక ప్రాంతమంతా అస్సక, అశ్మక జనపదాలే అని ప్రాచీన బౌద్ధవాంగ్మయం వల్ల తెలుస్తున్నది. ఇటీవల పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. బోధన్ ప్రాంతం నుండి అనగా అశ్మక దేశం నుండి వెళ్ళిన బౌద్ధ బిక్కువు బావరి గౌతమ బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే అతనిని చూశాడని ప్రతీతి. అంతే కాదు బుద్ధుడి చిత్రాన్ని గీసినవాడు అతనే అంటారు.
'అంధక రట్టము' అంటే - 'అంధక' పదాన్ని ప్రాంతం, జాతి వాచకంగా ఆనాడు ఉపయోగించారు. రట్టము అనగా ప్రాంతం లేదా రాష్ట్రం. ఈ ప్రాంతం బౌద్ధులు చైత్యారాధకులు. వీరిలో పూర్వశైలీయులు, అపరశైలీయుల వంటి సంప్రదాయాలు ఉండేవని బౌద్ధ వాంగ్మయం వల్ల తెలియవస్తున్నది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|