|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
1995లో వేరొక కేసులో, ఒక రోగి లుధియానాలోని ఒక ఆస్పత్రిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల చేరాడు. విధి నిర్వహణలో ఉన్న నర్సు వైద్యుడికి సమాచార మివ్వగా దాదాపు 25 నిమిషాల వరకు ఎవరూ రాలేదు. చివరకు ఇద్దరు డాక్టర్లు వచ్చి ఆక్సిజన్ సిలిండర్ ను రోగికి అమర్చారు. దానివల్ల శ్వాస ఇబ్బంది ఇంకా పెరిగింది. రోగి నిలబడదామని ప్రయత్నించినా వైద్యులు వారించారు. తీరా చూస్తే ఆక్సిజన్ సిలిండర్ ఖాళీదని తేలింది. వేరే ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఈ లోపు రోగి చనిపోయాడు. వైద్యుడి మీద క్రిమినల్ కేసు దాఖలు చేశారు
రోగి బంధువులు. సుప్రీంకోర్టు క్రిమినల్ కేసును కొట్టివేస్తూ, వైద్యుడు ఆ పరిస్థితుల్లో క్రిమినల్ చర్యలకు బాధ్యుడుకాదని, మహా అయితే హాస్పిటల్ నష్టపరిహారానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, వైద్యులు ఏఏ సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారో పేర్కొనడం జరిగింది.
ఈ విధంగా వైద్యుల అజాగ్రత్తకి, సందర్భాన్ని బట్టి, అజాగ్రత్త తీవ్రత బట్టి సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని మనకి స్పష్టమౌతోంది.
క్రిమినల్, సివిల్ చట్టాలు అజాగ్రత్త అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించకపోయినా, అనేక సంవత్సరాల్లో, వివిధ కేసుల్లో యిచ్చిన తీర్పుల వల్ల ఒక అవగాహనకి రావడానికి ఆస్కారమేర్పడింది. ఒక జాగ్రత్తగల వ్యక్తి సాధారణంగా ఏవిధంగా ప్రవర్తిస్తాడో, ఆ ప్రవర్తనకి విరుద్ధమే అజాగ్రత్త అనవచ్చు. కాని వృత్తులు నిర్వహించేవారిలో అజాగ్రత్త స్థూలంగా ఈ క్రింది విధంగా విభజించవచ్చు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|