|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
ఒక న్యాయపరమైన విధిని నిర్వర్తించేటప్పుడు ఒక వ్యక్తి తగిన జాగ్రత్త తీసుకోవలసిన అవసరముండడం,
ఇంటువంటి జాగ్రత్త ఆ వ్యక్తి తీసుకోకపోవడం,
దానివల్ల వేరొక వ్యక్తికి నష్టం జరగడం
కాబట్టి నష్టం జరగనపుడు ఎటువంటి అజాగ్రత్తకీ శిక్షలేదు.
ఏ వత్తి చేస్తున్న వారికైనా అజాగ్రత్త శిక్షార్హమౌతుంది. వైద్యులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఆర్కిటెక్టులు కావచ్చు, చార్టర్డ్ అకౌంట్లైనా కావచ్చు. ఎందుకంటే వారికి మాత్రమే వారివారి వృత్తులలో ప్రావీణ్యత ఉంటుంది. కాబట్టి, వారి వృత్తుల్ని సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అలా అని వారి వృత్తి నిర్వహణలో లబ్దిదారులకి ఫలితాన్ని ఖచ్చితంగా చూపించాలన్న నియమమేమీ లేదు. వృత్తి నిర్వహణలో వారిని బాధ్యులుగా చేసే సందర్భాలు రెండే :
1) వారికి వారు పేర్కొన్న ప్రావీణ్యతకి సంబంధించిన ప్రత్యేకమైన అర్హతలు లేకపోయినపుడు,
2) వారి ప్రావీణ్యతకి తగ్గట్టుగా ప్రవర్తించనపుడు (తగినట్టుగా ప్రవర్తించారా లేదా అన్నది వారివారి వృత్తులలో సాధారణ నిపుణుడు ఎలా ప్రవర్తిస్తాడన్నది ప్రమాణం కాని, వారి వృత్తులలో రాణించిన వ్యక్తుల ప్రవర్తన ప్రమాణం కాదు)
వైద్యుల విషయంలోనయితే అజాగ్రత్త ఆరోపణలో మూడు విషయాల్ని ముఖ్యంగా చూస్తారు :
1) సాధారణంగా అందరూ పాటించి అనుసరించే పద్ధతి ఒకటుండడం,
2) ఆరోపణ చేయబడ్డ వైద్యుడు ఆ పద్ధతిని పాటించకపోవడం
3) వైద్యం చేసిన విధానం జాగ్రత్తగా ఉండే ఏ సామాన్య వైద్యుడూ పాటించని విధానమై ఉండడం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|