|
|
Articles: TP Features | హెడ్లీ చిన్నప్పట్నించీ అంతే! - Site Administrator
| |
'అతను ఎన్నడూ ఒంటరిగా లేడు. ఇంటిలో అనేక మంది పరిచారికలు ఉండేవారు. ఒక యువతితో మాత్రం డేటింగ్ చేశాడు' అని టీనేజి యువకుడు దావూద్ గిలాని గురించి ఒక వ్యాసంలో ఆ పత్రిక రాసింది. 'కాని అతనికి ఇప్పుడే ఒక క్రికెట్ జట్టులో చేరే అవకాశం వచ్చింది' అని ఆ పత్రిక పేర్కొన్నది. కుటుంబ మిత్రుల సమాచారం ప్రకారం, టీనేజర్ గా ఉన్న దావూద్ చాలా త్వరగానే తన తల్లి మద్యం అలవాటుపైన, అనేక మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడంపైన తిరుగుబాటు చేశాడు. 'యువతులు కోరుకున్న వెంటనే అందుబాటులోకి వచ్చిన రోజులవి' అని ఖైబర్ పాస్ బార్ లో పనిచేసిన జే విల్సన్ ఇంగ్లండ్ నుంచి ఒక ఇ-మెయిల్ మెస్సేజ్ లో రాశారు. 'అమెరికన్ వయోజనులకు ఉండే సరదాలకు దావూద్ ఏమీ మినహాయింపు కాడు' అని జే విల్సన్ పేర్కొన్నారు. ఆ తరువాత దావూద్ గిలానీ ముస్లిమేతరులందరిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయసాగాడని బార్ లో ఒకప్పుడు పనిచేసిన లారెంజో లాకొవరా చెప్పారు.
'విశ్వాసఘాతకులందరిపై తనకు ద్వేషం ఉందని అతను స్పష్టం చేస్తుండేవాడు' అని లాకొవరా న్యూ మెక్సికో నుంచి టెలిఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు. '14వ శతాబ్దం తిరిగి రావడం గురించి అతను ఎప్పుడూ మాట్లాడుతుండేవాడు. ప్రపంచంపై ఇస్లామ్ ఆధిపత్యం వహించబోతున్నదని చెప్పేవాడు' అని ఆయన తెలిపారు. తన కుమారుని జీవితాన్ని సరైన మార్గంలోకి మళ్ళించడానికి సెరిల్ హెడ్లీ ప్రయత్నించారు. 1985లో ఆమె అతనిని ఖైబర్ పాస్ కు ఇన్ చార్జిని చేశారు. కాని అతను దానిని సమర్థంగా నిర్వహించలేకపోయాడని, రెండేళ్ళ తరువాత వారు బార్ ను వదులుకోవలసి వచ్చిందని కుటుంబ మిత్రులు తెలిపారు. సెరిల్ మూడవ వివాహం చేసుకోగా ఆమె కుమారుడు న్యూయార్క్ కు బయలుదేరాడు. అక్కడ మన్ హట్టన్ ప్రాంతంలో అతను రెండు వీడియో రెంటల్ స్టోర్స్ ను ఏర్పాటు చేశాడు. అందుకు అతనికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కాని పూర్తిగా చట్టబద్ధమైన మార్గంలో ఆ నిధులు అతనికి వచ్చి ఉండకపోవచ్చునని కోర్టు ఫైళ్ళు సూచిస్తున్నాయి.
1998లో 38 ఏళ్ళవాడైన దావూద్ గిలానీపై పాకిస్తాన్ నుంచి అమెరికాలోకి హెరాయిన్ స్మగ్లింగ్ కు కుట్ర పన్నాడనే నేరాన్ని నిర్థారించారు. అతని అరెస్టు తరువాత అతను ఒక దశాబ్దంపైగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో తన పాత్ర గురించి, తన పాకిస్తానీ సప్లయిర్ల గురించి ఎక్కువ సమాచారమే అందజేసినట్లు కోర్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. అతనికి రెండేళ్ళ కన్నా తక్కువ కాలానికి జైలు శిక్ష విధించారు. ఆతరువాత అతను డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డిఇఎ) కోసం అజ్ఞాతంగా నిఘా కార్యక్రమాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ కు వెళ్ళాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|