|
|
Articles: Short Stories | తోడు...నీడ - Site Administrator
| |
'అవును మా అమ్మే లేనప్పుడు మాకింకెవరున్నారు? అని బాధ పడుతూ మనవల్ని తీసుకుని వెళ్ళి పోతుంటే గుండెల్ని పిండే బాధని అనుభవిస్తూ అలా శిలలా బిగుసుకు పోయాడే తప్ప ఆ రక్త బంధాన్ని ఆదరించి ఆపు జేసుకో లేక పోయాడు. ఈ కసాయి దాని ప్రేమ కోసం తీరా అది కళ్ళు తెరిపించాక ఏముంది? శూన్యం? అప్పట్లో అనుకున్నాడు. తను వాళ్ళతో వెళ్ళి వాళ్ళ పంచన పడి ఉండటం కంటే ఇక్కడ పార్వతితో స్వేచ్చ గా ఉండచ్చని. అందుకే ఉన్న ఆస్తులు పొలాలు తోటలు అమ్మి సొమ్ము చేసి మనవల పేర్న బ్యాంక్ లో వేసి ఉంచాడు. కానీ పార్వతి ఇలా ఎదురు తిరుగుతుందనుకో లేదు. ఎంతైనా మగవాళ్ళు తెంచుకున్నంత తొందరగా ఆడవాళ్ళు అనుబంధాలను తెంచుకోరు. ఇదంతా తన తెలివి తక్కువ. ఎంత తెలివి, ఎన్ని డిగ్రీలు ఉంటేనేం జీవితానికి పనికి రానప్పుడు దండగే. అసలీమెతో పరిచయమే పెద్ద పొరబాటు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|