|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
గిరిజనులు, ఆ మాటకొస్తే జానపదులందరూ హనుమంతునివంటివారు. అంటే వారి పాండిత్యం వారికి తెలియదు. పాఠంలా గడగడా అప్పచెప్పలేరు. వారికి గుర్తు చేయాలంటే ఆ సహజ పాండిత్యం అనుపానులతో పాటు అడగవలసిన తీరుకూడా కొంత తెలియాలి. సంస్కృత నాటక కర్త మురారి 'అనర్ఘరాఘవం'లో అన్నట్లు అటు ఇటు గెంతిన వానరులకంటే, మథించిన మందర పర్వతానికే సముద్రగర్భంలో గల సంపదను గూర్చి తెలుసు.
పరిశోధన సమయంలో... గిరిజనులు వన్యప్రాణుల సినిమాలు చూడడమేకాక - భాగ్యనగరం లోగల నాటి హైదరాబాద్ నేచర్ క్లబ్, నేటి బర్డ్ వాచర్స్ సొసైటీ వారితో పరిచయం పెంచుకోసాగాను. ఇప్పుడు డెహరాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్సిస్టిట్యూట్ లో శాస్త్రవేత్త వినోద్ సి చౌదరి అప్పడు జూ పార్కులో మొసళ్ళ పెంపకం ప్రాజెక్టులో పనిచేసే వారు. నాటి విద్యార్థులు అశీశ్ పిట్టి, ప్రాణేశ్ వగైరాలు తమ ఆసక్తి కొనసాగిస్తూ ఆ రంగంలో పేరు సంపాదించుకుని అనేక సంకలనాలు వెలువరిస్తున్నారు. కాని వాళ్ళలాగ చెట్లను, పక్షులను గుర్తుపట్టడం నావల్లకాలేదు. కాని జిమ్ కార్బెట్ వంటి బిట్టూ సెహగల్, ఉల్లాస్ కరంత్, వాల్మీకీ థాపర్, బిల్లీ అర్జున్ సింగ్ షికారీల వంటి వన్యప్రాణి ప్రేమికులరచనలు చదవడం బాగా అలవాటైంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|