|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
భాషాభివృద్ధికి వ్యాకరణ సమస్య. 'వ్యాకరణమంటే ఏదో స్వరూప నిర్ణయం అని కొందరికి అపోహ ఉన్నట్టు కనిపిస్తుంది... ఉన్న భాషకు వ్యాకరణం రాస్తారు గాని, ఉన్న వ్యాకరణం కోసం భాషను మార్చుకోరు. ఇది సాధ్యం కాదు, వాంఛనీయంకాదు...' అంటారు కొ.కు. ఒక సంఘటన ఇలా జరిగిందే అనుకుందాం. విద్యాశాఖాధికారి పాఠశాల పర్యవేక్షణకొచ్చారు. వస్తూనే తరగతి గదిలోకి దూరారు -
'ఇది ఎన్నో తరగతి?' ప్రశ్నించారు.
'పది..' అన్నాడు ఉపాధ్యాయుడు
'మీరేం బోధిస్తుంటారు?'
'తెలుగు...' తెలుగు ఉపాధ్యాయుడు చెప్పాడు.
'రాయడం, చదవటం బాగావచ్చా... వీళ్ళకి?' విద్యాశాఖాధికారి. ఉపాధ్యాయుడు వినయంగా మవునం వహించాడు.
'ఒక సంఘటనను విద్యార్థులకు చెప్పి. ఆ విషయమై అయిదువాక్యాలు చెప్పి, అందరి చేతా రాయించండి'
ఉపాధ్యాయుడు సర్దుకొని, ఒకటి రెండు నిముషాలు సమయం తీసుకొని, తరగతి గతిలో ఆ మూల నుండి ఈ మూలకు ఒకసారి తిరిగి - ఒక విషాదకరమైన సంఘటనను చెప్పాడు. టేబిలు పైనున్న గ్లాసుడు నీళ్ళు తీసుకొని తాగి, మూతిని మండతో తుడుచుకొని - ఐదు వాక్యాలు చెప్పాడు (డిక్టేటు చేశాడు)
విద్యార్థులు రాశారు. పుస్తకాలు తెచ్చి ఒక్కొక్కరూ టేబిలుపై దొంతరగా ఉంచారు.
విద్యాశాఖాధికారి మొదటి పుస్తకం తీసి చూసాడు. గ్రీనింకుతో ఒక చోట గీత పెట్టాడు... ఒకటి, రెండు, మూడు అలా....
విద్యాశాఖాధికారి ముఖకవలికలు చూసి ఉపాధ్యాయుడికి భయం పట్టుకుంది, ఆ నాలుగు పుస్తకాలు పట్టుకొని బయటకెళ్ళిపోయాడు విద్యాశాఖాధికారి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|