|
|
Articles: TP Features | విద్యార్థుల విజయం - Site Administrator
| |
కానీ సోనియా నిర్ణయం, చిదంబరం ప్రకటన కొందరికి జీర్ణం కావడం లేదు. అన్ని పార్టీలలోని వలసవాదులు దీన్ని నిరసిస్తున్నారు. పరిణామాలు ఎటు దారితీయనున్నాయో అనూహ్యంగా ఉంది. ప్రధాన పార్టీల శాసనసభ్యులు రాజీనామాల ప్రహసనం మొదలైంది. దాదాపు వంద మంది ఎమ్.ఎల్.ఏలు రాజీనామా చేశారంటే వారి ఉక్రోశం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. ఆ వర్గాల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాడనికి ఈ రాజీనామాలు ఉపకరిస్తున్నాయి. నిన్నరాత్రి వరకు అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అన్న ప్రధాన పార్టీల వారు ఆరేడు గంటల్లో ప్లేటు ఫిరాయించారు. ఇది వలసవాదుల మనస్తత్వం.
వలసవాదులు ఎవరు?
బ్రతుకుదెరువు కోసం, పొట్ట చేతపట్టుకొని వచ్చినవారిని తెలంగాణావారు వలసవాదులు అనుకోవడం లేదు. ఇలాంటి వారిని ఇంకా ఇంతమందిని తెలంగాణా చిరుహాసంతో భరిస్తుంది. బ్రతుకులు కొట్టేవారిని, భూములు, ఆస్తులు ఆక్రమించుకొని కోట్లకు పడగలెత్తిన వారిని వలసవాదులంటున్నారు. తమ అవసరాలకు మించి ఆస్తులను కూడబెట్టుకున్నవారు వలసవాదులు. రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారు వలసవాదులు. సచివాలయంలో చక్రం తిప్పేవారు వలసవాదులు. ప్రభుత్వ అండతో భూములు, స్థలాలు, ఉద్యోగాలు అన్యాయంగా కొల్లగొట్టినవారు వలసవాదులు. ఇలాంటివారికి వ్యతిరేకంగానే తెలంగాణావారు ఉద్యమించింది. ఈ విషయంలో తెలంగాణా వారికి స్పష్టత ఉంది.
ఏ పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారు? కోయంబత్తూరు, ముంబాయిలలో లాగా పరిశ్రమలు స్థాపించి ఉత్పాదన ద్వారా సంపద సృష్టించారా? దళారి పనులతో హైదరాబాద్ చుట్టుపక్కల భూములను లక్షకు కొని కోటికి అమ్ముతూ తిమ్మిని బమ్మిని చేసి దాన్నే కష్టం అంటే ఎలా? 'మానిప్యులేషన్' కష్టం ఎలా అవుతుంది. హైదరాబాద్ లో లేదా తెలంగాణలో మొదట కాలుపెట్టిన రోజు మీ వెంట ఏమి తెచ్చారో తర్వాత కొలది కాలంలోనే ఎలా సంపన్నులయ్యారో యోచించుకోండి. మీ కష్టం ఏమిటో మీకే తెలుస్తుంది.
భూ సంస్కరణల చట్టం, రెంట్ కంట్రోల్ యాక్ట్, రిజిస్ట్రేషన్, రిక్రూట్ మెంట్ పాలసీలు, విధానాలు ఎవరు రూపొందించారు. వాటి రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాటి వల్ల ఎవరు ప్రయోజనం పొందారు? రంగారెడ్డి జిల్లాను ఎందుకు ఏర్పరిచారు? హుడా ఎందుకు ఏర్పడింది? హైమా రూపకర్తలు ఎవరు? కాగితాల మీద గ్రేటర్ హైదరాబాద్ ను ఎవరు సృష్టించారు? ఇప్పుడు దానికి మేమే హక్కుదారులమనే సాహసం ఎవరు చేస్తున్నారు? సమస్యను చారిత్రక దృష్టితో చూస్తే విషయం అర్థమవుతుంది. పైపై వాదనలు అనర్థాలను తెస్తాయి. సత్యం రామలింగరాజుకు అన్ని ఎకరాల భూమి ఎలా వచ్చింది? రామోజీ ఫిలింసిటీ వేల ఎకరాలలో ఎలా విస్తరించింది? ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు ఎలా అన్యాక్రాంతం అయ్యాయి? జంటనగరాలలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల భూమి ఎలా అన్యాక్రాంతం అయ్యింది. తవ్వితే చాలా విషయాలు బయటికి వస్తాయి. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|