|
|
Articles: TP Features | విద్యార్థుల విజయం - Site Administrator
| |
రియల్ మాఫియా మాయలో పడి వారి ఒత్తిడికి లొంగి మొదట రంగారెడ్డి జిల్లాను ఏర్పరచారు. ఆ తర్వాత హుడా, హైమా, గ్రేటర్, హౌసింగ్ బోర్డు లాంటి ఈ సంస్థలను వలసవాదుల ప్రయోజనం కోసం ఏర్పరిచారు. దాన్ని ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. ఇది హాస్యాస్పదం కాదా?
హౌసింగ్ బోర్డు ఏర్పాటువల్ల ఎవ్వరికి ఇండ్లు సమకూరాయి? కూకట్ పల్లి, వనస్థలిపురం కాలనీల్లో ఏ ప్రాతిపదికన ఇండ్లు కేటాయించారు. జిల్లాల వారీగా, ప్రాంతాలవారీగా రిజర్వేషను ఏమైనా ఇచ్చారా? జూబ్లీహిల్స్ కాలనీకి కేవలం పది రూపాయలకు గజం చొప్పున రెండున్నర వేల ఎకరాల భూమిని ఎవరు ఎవ్వరికి కట్టబెట్టారు? ఆ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత? విద్యానగర్, దోమలగూడా మొదలుకొని హైదరాబాద్ లో ఏర్పడిన వందలాది కాలనీల్లో వేలాది ఇండ్లను, స్థలాలను వలసవాదులకు అప్పనంగా వడ్డించుకున్నారు. సినీ పరిశ్రమాభివృద్ధికని వేలాది ఎకరాల భూమిని కోస్తాంధ్రావారికే కట్టబెట్టారు.
బి.హెచ్.ఇ.ఎల్., ఇక్రిసాట్ లకు దాదాపు పదివేల ఎకరాల భూమిని ఇచ్చారు. ఒక్క బి.హెచ్.ఇ.ఎల్ ఏర్పాటు సమయంలో ఆరు గ్రామాలు రూపుమాసిపోయాయి. ఆ గ్రామస్థులు పలువురు భిక్షగాళ్ళుగా, అనాధ శవాలుగా మారిపోయారు. వారి పిల్లలు బి.హెచ్.ఇ.ఎల్ లో అటెండర్లు కూడా కాలేక బి.హెచ్.ఇ.ఎల్. కాలనీలో ఆకుకూరలు అమ్ముకుంటున్నారు. ఇలాగే మిధాని, ఎన్.ఎఫ్.సి, ఇసిఐఎల్, హెచ్ సిఎల్, అటామిక్ ఎనర్జీ, డిఆర్ డిఎల్, డిఎమ్ ఆర్ ఎల్ లాంటి ఎన్నో సంస్థలకి రైతుల దగ్గర భూమిని అతి తక్కువ ధరకు లాక్కున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇచ్చిన ఐదువేల ఎకరాల భూమిలో మూడు గ్రామాలు మాయమయ్యాయి. ఈ భూములు కోల్పోయిన రైతులకు ఏమి ఇస్తే నష్టపరిహారం సరి అవుతుంది. ఆ భూములను మా సొంతం అంటున్న వారిని ఏమనాలి?
బొచ్చె, మంచం, వండుకోవడానికి కుండలు మాత్రమే ఉన్న చిన్న ఇంట్లోనే ఆస్తుల పంపకాలంటే ఎంతో కొంత ఘర్షణ జరుగుతుంది. అలాంటిది ఏడాదికి దాదాపు లక్ష కోట్ల పైగా బడ్జెట్ తో నడుస్తున్న రాష్ట్రం విడిపోయే ముందు అనేక సమస్యలు తలెత్తుతాయి. గడసరులు సహజంగానే ఎక్కువ లబ్ధి పొందుదాం అనుకుంటారు. సోదరుల్లా విడిపోదాం అనే ఆకాంక్షను అందరూ పాటిస్తే గొడవే ఉండదు. కానీ చారిత్రక పరిజ్ఞానం బొత్తిగా లేని మూఢ శక్తులు గ్రేటర్ హైదరాబాద్ అంశాన్ని అనవసరంగా లేవదీస్తున్నారు. 'హైదరాబాద్ లేని తెలంగాణా తలలేని మొండెం లాంటిది'. దీని కోసం ఇక్కడ మొండేలు కూడా పోట్లాడతాయని తెలంగాణావాదులంటున్నారు. ఈ విషయమై ఎలాంటి వాదాన్ని, అభ్యంతరాన్ని వినడానికి, ఉపేక్షించడానికి సిద్ధంగా లేమని తెలంగాణా వాదులంటున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|