|
|
Articles: TP Features | కృష్ణమ్మ కలపదా ఇద్దరినీ! - Site Administrator
| |
తెలంగాణ, రాయలసీమ విలీనానికి ఇదే వాదాన్ని ప్రాతిపదిక చేస్తుండడంతో ఇది వాస్తవరూపం ఎందుకు దాల్చడం లేదు? 'గడచిన 40 సంవత్సరాలలో రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖపాత్ర పోషించిన రాయలసీమ నాయకులు ఈ అవకాశాన్ని అత్యంత సంక్లిష్టంగా మార్చారు' అని సోషల్ సైంటిస్ట్ సి. రామచంద్రయ్య చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో ఈ నాయకులు ఎన్నడూ చేతులు కలపలేదని, మరీ దారుణంగా వారిని దూరం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
'రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన నేత. ఒక ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి వస్తే మరొక ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రిని నియమించాలనే నిబంధన ఈ ఒప్పందంలో ఉంది' అని రామచంద్రయ్య తెలిపారు. రాయలసీమకు చెందిన సంజీవరెడ్డి సిఎం కాగా, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రిని నియమించడంపై ఆయన ఆసక్తి కనబరచలేదని రామచంద్రయ్య చెప్పారు. 'తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి ఇబ్బంది కలిగించే ఆరో వేలు లాంటివాడు' అని సంజీవరెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించినట్లు చెబుతారు. ఈ నాయకులు కలిగించిన అభిప్రాయాలు కూడా పెద్ద అవరోధంగా నిలిచాయి. గడచిన దశాబ్దంలో ముఖ్యమంత్రులుగా ఉన్న, రాయలసీమ ప్రాంతానికి చెందిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాల మధ్య అగాధాన్ని పెంచారనడంలో సందేహం లేదు. వైఎస్ఆర్ నిధులను రాయలసీమకే మళ్ళిస్తున్నారని తెలంగాణ ప్రాంతం నాయకులు ఆరోపించారు కూడా. 'వైఎస్ఆర్ రాయలసీమలో అపారంగా పెట్టుబడులు పెట్టారని తెలంగాణ వాసులు పొరబడ్డారు. ఆయనకు కడపపై మాత్రమే ఆసక్తి ఉన్నది' అని హెచ్ఆర్ఎఫ్ కు చెందిన చంద్రశేఖర్ పేర్కొన్నారు.
తెలంగాణ మద్దతుదారులను ఒప్పించడమే పెద్ద సమస్య కాగలదు. తెలంగాణ ప్రాంతంతో విలీనానికి రాయలసీమ ప్రాంత వాసులు అంగీకరించవచ్చు కాని తెలంగాణ ప్రాంత వాసులు ఇందుకు 'ససేమిరా' అంటున్నారు. ఫ్యాక్షన్లతో కూడిన ప్రాంతమనే గుర్తింపు ఉండడం రాయలసీమకు కొత్త తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఆమోదం పొందడానికి అవరోధంగా ఉన్నది. 'మాకు ఉమ్మడి సంస్కృతి ఎన్నడూ లేదు. ఏకాత్మభావం గాని మరొక ప్రాంతంతో తాదాత్మ్యత గాని లేదు. పైగా రాయలసీమలో ఫ్యాక్షనలిజం పాతుకుపోయింది. తెలంగాణలో అటువంటిది లేదు' అంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి మాటలు గమనార్హం.
ఈ ప్రాంతాల వారు ఇరుగు పొరుగువారిగా ఉంటారే కాని భాగస్వాములు కాలేరన్నమాట!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|