|
|
Articles: My Thoughts | కలకంటి కన్నీరొలికిన.. - Site Administrator
| |
'ఒరే అన్నయ్యా! నేను బోలెడు కట్నం తీసికెళ్లాను. మంచి ఉద్యోగం చేస్తున్నాను. అందుకే నేనత్తారింట్లో సుఖ పడి పోతున్నాననుకుంటున్నావు కదురా! పిచ్చి అన్నయ్యా! అసలీ లోకంలో ఆడది కష్ట పడ్డానికే పుడుతుందిరా. ఆడది తన కష్తాల్ని పైకి చెప్పుకోదు. మౌనంగా రోదిస్తుంది. తన బాధలను తనలోనే దాచుకుంటుంది. తన బాధలను పెదవి విప్పి పైకి చెప్పుకుంటే తన భర్త నలుగురిలోనూ చులకనై పోతాడు. ఇంటి గుట్టు లంకకు చేటన్నట్టుగా తన పరువు పోవడమే కాకుండా నలుగురిలోనూ నవ్వులపాలౌతానేమో ననే భయంతో ఆడది అంతరాంతరాల్లోనే కుమిలిపోయి అనారోగ్యం పాలై భర్తకన్నా ముందుగా వార్థక్యాన్ని తెచ్చుకుంటుంది. నీకు తెలుసునా అన్నయ్యా! 'నేనెన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో? ఎన్ని రాత్రులు నాలో నేనే మౌనంగా రోదించానో? 'నేను పడుకునే నా మంచానికీ నా తలగడకీ నేను కార్చిన కన్నీళ్లతో అవి తడిసినందువల్ల వాటికి బాగా తెలుసు. నేననుభవిస్తున్నది ఆనందమో చిత్ర వధోను. మొదటి కాన్పు నాకు ఎబార్షన్ అయిన విషయం నీకు తెలుసున్నదేగా? అదెలా జరిగిందనుకుంటున్నావ్? - స్కానింగ్ తీయించి, నా కడుపులో పెరుగుతున్నది ఆడ పిండ మని తెలిసినా ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా నాకీ పశువులు ఎబార్షన్ చేయించార్రా! ఆ రోజు నేనెంత వెక్కి వెక్కి ఏడ్చానో నీకు తెలీదు.. ఆడదాన్నై వుండీ మరో ఆడ పిల్లకి జన్మ నివ్వలేని పాతకినీ-హంతకురాల్నీ నేన్రా!'
'ఈ ఇంట్లో నేనందరికీ ఓ పరిచారికన్రా అన్నయ్యా! ఇంట్లో వాళ్లందరి కళ్లూ నా మీదే నిఘా! ఇక సూటి, పోటీ మాటలంటావా? వాటికి అంతూ పొంతూ వుండదు. నేనుద్యోగం చేస్తున్నానని నాకు గర్వంట! దానికి తోడు మీ బావ గారికి నా మీద అనుమానం. ఆయన లెక్కల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఆడదీ చెడిపోయినట్లే. అలాగని మళ్లీ నేనుద్యోగం మానేస్తానంటే ఒప్పుకోరు. నేను తెచ్చే జీతం కావాలి గాని నేనక్కర్లేదు. ఇంత చేస్తున్నా ఈ ఇంట్లో వాళ్లకి నా మీద కనీస జాలీ కరుణా వుండవు. ఉద్యోగం చేసి అలసి పోయి ఇంటికి వచ్చినా అన్నీ నేనే చూచుకోవాలి. ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పాల పాకెట్లు తెచ్చి కాఫీ కలిపి అందరికి ఇచ్చకే నేను తాగాలి. ఈ ఇంట్లో వారెవరూ కూడా ఇవతల చెంబు తీసి అవతల పెట్టరు. ఎంతాలస్యంగా వచ్చినా అంట్లు నేనే తోమాలి. ఆ తరవాత వంట చేసి నలుగురికీ పెట్టి ఏమైనా మిగిలితేనే నేను తినాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|