|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
ఈ పరిమట్టులలో ఎక్కువగా దెబ్బతినిన అది తెలుగు నానుడి. పెక్కు నూరేళ్ళుగా తెలుగు నానుడి సంస్కృతీయుల చేతిలో గుత్త బేరంగా ఉండిపొయ్యింది. ఆ కారణంగా ఈనాడు తెలుగు నానుడి అని మనము అనుకొంటూ ఉండే రచనలలో ఎక్కువ భాగము సంస్కృతీయుల చేత రాయబడి, వారి చేతనే పెంచి పెంపొందించబడి, వారి అనిపింపులు ఒప్పింపులు (feelings and convictions), అనుభూతులు అపోహలు, అనుమానాలు భయాలు, మప్పితము విసాగులు, మతము పోకడలు వగయిరాలతో తొణికిసలు ఆడుతూ ఉంది.
అలాటి నానుడిని తనది అనుకొంటున్నాడు నేటి తెలుగుబిడ్డ. అందులో తెలుగుదనము సున్న, అయినా బాధపడడు. దానిలో ఉండే సంగతులకు తన రోజువారీ బతుకుకు ఏలాటి పొత్తు లేదు. అయినా ఆందోళన చెందడు. పయిగా ఆ రచనలు అన్నీ కూడా మామూలు తెనుగుకు అపాడి చేసి, అవమానం కలిగించేవిగానే ఉన్నాయి. అయినా అచ్చెరువు అందడు తెలుగుబిడ్డ. కారణము : మగత, ముభావం. దీని పంటే, నేడు మనం తెలుగులో మాటలాడినా, రాత వరకు వచ్చేది అప్పటికి అది ఆంద్రము అవుతుంది. తెలుగులో కవితలు అల్లినా, అది ఆంద్ర కవిత అవుతుంది. తెలుగులో రచనలు సాగించినా, అది ఆంద్ర సాహిత్యం అవుతుంది. నాలుగు కోట్ల తెనుగుల నెలవు తెలుగునాడు లేక తెలింగానా అయినా, అది పయి మట్టులలో ఆంద్రప్రదేశం, విశాలాంద్ర అవుతుంది. తెలుగు వారు సంతరించుకొనేవి తెలుగు విసాగు మప్పితాలు కావు. అవి ఆంద్ర సంస్కృతీ నాగరికతలు. వారు ఏర్పాటు చేసుకొనేవి తెలుగు నానుడి కూటకాలు కావు, అవి ఆంద్ర పరిషత్తులు, ఆంద్ర సదస్సులు, ఆంద్ర అకాడమీలు. వారిది తెలుగు చరిత కాదు, అది ఆంద్ర చరిత్ర.
మన పిల్లలు బడులలో చదివేది తెలుగు అయినా, వారు ఏర్పాటు చేసుకొనేవి తెలుగు నానుడి కూటాలు కావు, అవి ఆంద్ర బాషా సముతులు. మనము జరుపుకొనేవి తెలుగు పండగలు, పబ్బాలు కావు, అవి ఆంద్ర ఉత్సవాలు. మనవి తెలుగు ఆనువాయిలు ఆనువాయితీలు కావు, అవి ఆంద్ర సాంప్రదాయాలు. చివరకు మనకు మిగిలింది :
ఆంద్ర విశ్వ విద్యాలయము, ఆంద్ర నాటక అకాడమి, ఆంద్రసాహిత్య అకాడమి, ఆంద్రప్రబ, ఆంద్ర పత్రిక, ఆంద్రజ్యోతి, ఆంద్రబూమి, విశాలాంద్ర, ఆంద్రప్రదేశము, ఆంద్ర చేంబరు ఆప్ కామెర్సు, ఆంద్ర పిలుము చేంబరు, ఆంద్ర సిమెంటు పాక్టరి, ఆంద్ర సయింటిపిక్ కంపెని, ఆంద్ర బాంకు, ఆంద్ర ఇన్సూరెన్సు, ఆంద్రప్రదేశ లెజిస్లేటివు అసెంబ్లీ, ఆంద్రప్రదేశ లెజిస్లేటివు కవున్సిలు, ఆంద్ర సహకార సంగము, ఆంద్ర సుగర్సు, ఆంద్ర అది, ఆంద్ర ఇది... ఆంద్ర అన్ని.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|