|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
పయి రీతిగా అడుగు అడుగున తెలుగు అనే మాటకు అడ్డము వస్తూ దానిని మెల్ల మెల్లగా తీసి ఎయ్య చూస్తూ, కొంతవరకు తీసి ఎయ్య కలిగిన ఈ ఆంద్ర అను మాట ఎక్కడిది? ఏలాగ, ఇప్పుడు వచ్చింది? దీనిని ఎవరు తెచ్చినారు? అనేవి తెలుసుకోవడమే ఈ ఉరువు సంకల్పం.
అంద, అంద్ర, ఆంద్ర :
అంద, అంద్ర, ఆంద్ర అనే అమాయకంగా కనపడే ఈ మూడు మాటలలో ఒకరి చరితను మరి ఒకరి మీద, ఒక జాతి చరితను మరి ఒక జాతి మీద బలవంతంగా రుద్దడము, గొంతులో గొట్టముతో పోసి మింగించడము అనే గోర అపా దాగి ఉంది అని పెక్కులకు తెలియకపోవచ్చు. ఆంద్ర అనేదే సరి అయిన రూపము అని పెద్దలు మల్లంపల్లి సోమశేకరశర్మ మొదలు అయిన వారు వాదిస్తే ఆంద్ర అనేదే ఒప్పు అనే వారు కూడా చాలా మంది ఉన్నారు. అంద అనేది ప్రాకృత రూపము అని అందరూ ఒప్పుకొంటారు. అనగా అంద అనే ప్రాకృత మాట సంస్కృతములో అంద్ర అయి ఆంద్ర అయింది అనుకోవచ్చు.
శతపద బ్రాహ్మణములో ఆంద్ర అనే మాట ఉంది. అది ఒక తెగకు చెందిన అదిగా కనిపిస్తుంది. పురాణాలలో వీరిని విశ్వామిత్రుని కొడుకులలో ఒకడు అయిన ఆంద్రుని సంతానము అని, బలి చక్రవర్తి కొడుకులలో ఒకడు అయిన ఆంద్రుని సంతానము అని సూచించబడి ఉంది. వింద్య సీమలలో ఏర్పడిన బోజ రాజ్జెముల (పడిపోయిన ఆర్యుల)లో ఒకటి ఆంద్ర రాజ్జెము అని కూడా సూచనలు ఉన్నవి. ఇది అంతా నిజము కావచ్చు. కాని ఈ ఆంద్ర అను మాట తెనుగుకు ఏ రీతిగా వర్తిస్తుంది అనేది ఈ వివరాలు తెలపవు.
అశోకుని చెక్కింపుల (Inscriptions)లో అందకుల ఊసు ఉంది. బవుద్ద ఆనువాయితీలో అందకులు అనే బవుద్ద బిచ్చకుల సంగము ఒకటి అమరావతిలో ఉండిన అట్టు తెలుస్తుంది. అందుచేతనే సివస్కందవర్మ మయిదవోలు చెక్కింపులో గుంటూరు - కిస్ట మండలాన్ని అందపదా అని పిలవడము జరిగింది అని ఊహించే వారు ఉన్నారు. కాని అందపద లేక అందపదియ అనే మాట గుంటూరు - కిస్ట మండలానికి చెందిన అది కాదు, అది కడప, చిత్తూరు, ఉత్తర ఆర్కాడు జిల్లాలలోని వెలికొండల సీమకు చెంది అది అని వాదించే వారు కూడా ఉన్నారు.
గ్రీకు రాయబారి మెగాస్తనీసు (కీ.ము.4-గో నూరేడు) 'ఆందిరే' అనే రాజ్జెము చాలా బలంగా ఉండిన అట్టు తన 'ఇండికా'లో రాసినాడు అట. టాలెమి, పెరిప్లసు అనే చరితాకారులు (కీ.త. 2-డో నూరేడు) 'ఆందిరే' అను రాజ్జెము కిస్ట-గోదావరి సీమకు లోపలగా ఉన్నట్టు రాసినారు. అంటే అది నేటి మరాటా సీమ కావచ్చు. అప్పుడు ఆ మాటకు తెనుగులకు అట్టే పొత్తు కానరాదు. పయిగా 'ఆందిరే' ఒక రాజ్జెము, జనులు కాని తెగ కాని కాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|