|
|
Articles: TP Features | కొత్త శక్తి, నూతన ధైర్యం - Site Administrator
| |
(మోహన్ రావు దివ్వెల)
పేరు : స్వామి వివేకానంద (నరేంద్రనాథ్ దత్తా)
తండ్రి పేరు : విశ్వనాథ్ దత్తా
తల్లి పేరు : భువనేశ్వరి దేవి
పుట్టిన తేది : 12-1-1863
పుట్టిన ప్రదేశం : కలకత్తా
విద్యాభ్యాసం : కలకత్తాలో
పరమపదించిన తేది : 4-7-1902.
స్వామి వివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టిన రోజునే 'జాతీయ యువజన దినోత్సవంగా' కూడా జరుపుకుంటారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా గురుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడాయన. గురువు పేరు మీదుగా 'రామకృష్ణ మఠం' స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు లక్షలాది మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా పొందుతున్నారు. చిన్నతనం నుంచీ మంచి విద్యార్ధిగా అందరి మెప్పునూ పొందిన వివేకానందుడు ఎప్పుడూ క్లాసులో మంచి మార్కులతో ఫస్ట్ గా నిలిచేవాడు.
ఒకాసారి జాగ్రఫీ మాస్టారు అడిగిన ప్రశ్నకు వివేకానందుడు సరైన సమాధానాన్ని చెప్పి కూడా శిక్షను అనుభవించాడు. తాను తప్పుగా భావించి దానికి శిక్ష విధించారు. క్లాసులోనే అందరి ముందు 'సార్ మీరు ఏ శిక్ష వేసినా సరే, నేను చెప్పిన సమాధానం సరైనదే. నేను ఏ తప్పూ చేయలేదు' అంటూ బిగ్గరగా చెప్పిన ధీశాలి వివేకానందుడు. బాలుడిగా వివేకానందుడు చెప్పిన ఆ మాటలకు, ధైర్యానికి, ఒక్కసారిగా ఆ మాస్టారు ఆశ్చర్యపోయారు. వివేకానందుడు స్కూలు అయిన వెంటనే ఇంటికి వచ్చి ఏడుస్తూ అమ్మతో జరిగిన విషయం చెప్పాడు. దానికి తల్లి భువనేశ్వరి దేవి 'బాబూ నువ్వు చెప్పింది నిజమేనని నీ మనసుకు పూర్తిగా తెలుసు. నిజానికి ఎంత శక్తి అయితే ఉందో, దానివలన అన్ని కష్టాలు, సమస్యలు కూడా వస్తాయి. వాటికి భయపడకూడదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిజాన్నే నమ్ముకో' అంటూ ఓదార్చింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|