|
|
Articles: TP Features | స్వర్గం-నరకం...ఎక్కడ? - Site Administrator
| |
(ఆనంద్ రావు)
బద్ధకం బరువుతో కనురెప్పలు లేవవు. నిద్రమంచం మీద నుంచి దిగబుద్ధి కాదు. కానీ లేచి తీరాలి. లేవండి.
శుభ్రంగా టిఫిన్ లాగించెయ్యండి. లేదా మానెయ్యండి. ఉద్యోగానికి వెళ్ళిపొండి.
మంచో, చెడో రోజు గడచిపోతుంది.
తినండి...నిద్రపోండి. తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా. అలా బతుకుబండి లాగించెయ్యండి.
కానీ మనది కాని ఓ రోజు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసాన్రా బాబూ అంటూ మనల్ని మనమే తిట్టుకునే రోజు. ఆ రోజు ఆఫీసులో బాసు పనిగట్టుకుని మనల్నే తిడుతుంటాడు. కుంగుబాటు.. ఆగ్రహం...నిస్సహాయత.. నరకం. బతుకే నరకమనిపించే భావన. అంతటా అంధకారమే కనిపిస్తుంది.
ఇంతలో ఎక్కడి నుంచో స్నేహితుడు ఊడిపడతాడు. ఎక్కడో ఏకాంత దీవిలో సెలవు రోజులను సరదాగా గడపే ప్లాన్ చెబుతాడు. అస్సలు ఆ ఆలోచనే మనలో హుషారు నింపేస్తుంది. దానికి తోడు అప్పటికప్పుడు ఆ స్నేహితుడు సినిమాకు లాక్కుపోతాడు. ఆపై రాత్రి మంచి భోజనం. అబ్బా జీవితం అంతా ఆనందమయంగా మారిపోతుంది. భవిష్యత్ అంతా రంగులమయం అయిపోతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|