|
|
Articles: Short Stories | విధ్వంసం - Mr. Pratap Cherukuri Pratap
| |
'చివరగా ఒక్క విషయం గుర్తుంచుకో. ప్రభుత్వం మనవాళ్ళ కోసం డేగ కళ్ళతో ఎదురు చూస్తోంది. ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ మొత్తం దేశమంతటా మన కోసం గాలిస్తున్నాయి. ఈ పరిస్థితులలో హాండిల్ చెయ్యడం చాలా కష్టం. ఆసలు ఖాజా గ్రూపుకు ఈ ప్రొజెక్ట్ ఇవ్వాలనుకున్నాం కాని నీ ట్రాక్ రికార్డ్ చూసి నీకు ఈ ప్రాజెక్ట్ అప్పజెపుతున్నాను. ఈ ప్రోజెక్ట్ పట్ల మన సెంట్రల్ కమిటీ చాలా ఆసక్తిగా చూస్తోంది. ఫెయిల్ అయిందో నువ్వు నీ కుటుంబం మొత్తం మటాష్ అయిపోగలరు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. సో బీ కేర్ఫుల్'
కాస్త తీవ్రం గా చెప్పాడు అమీనుల్లా.
'మీరేం ఫికరు కాకండి సార్. నేనే మొత్తం..' ఖలీద్ ఇంకా ఏదో చెప్పబోయెంతలో ఫోన్ కట్ అయ్యింది.
ఆనందంతో ఎగిరి గంతేసాడు ఖలీద్. యాభై లక్షల కాంట్రాక్ట్. ఆమునిషన్, తన వారికి మరియు ఇతర ఫార్మాలిటీస్ కు ఒక పదిహేను ,ఇరైవై దాకా ఖర్చయినా సులువుగా ముప్పైకి పైగా మిగుల్తాయి. ఒక సంవత్సరం పాటు హాయిగా దుబాయ్ వెళ్ళి తన దోస్త్ లందరినీ చూసి రావచ్చు. వెంటనే ఫ్రిజ్ నుండి విస్కీ బాటిల్ వోపెన్ చేసి ఒక లార్జి పెగ్గు కలుపుకొని త్రాగనారం భించాడు. దాంతో పాటే ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ చెయ్యాలా అన్న ఆలోచన కూడా ప్రారంభించాడు.
ఖలీద్ చాలా తెలివైన వాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోగా మేనమామ ఇంట్లో పెరిగాడు. తన స్వంత వారి నుండే కాక ఇతరుల నుండి కూడా నిరాదరణ, ప్రేమ రాహిత్యం లభించడంతో ఖలీద్ మనస్తత్వం రెబిలియన్ గా మారిపోయింది. దొంగతనాలు నేర్పుగా చెయ్యడం, అమ్మాయిలను రేప్ చెయ్యడం వంటివి చేయడం ప్రారంభించాడు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో హైదరాబాద్ లో ఒక రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించాడు. రాజకీయ ప్రయోజనల రీత్యా హత్యలు, కిడ్నాపింగులు, మత ఘర్షణలు రేపడం వంటివాటిలో ఆ నాయకుడి నీడలో వుండి తర్ఫీదు పొందాడు. ఆ తర్వాత ఒక విదేశీ గూఢచారి సంస్థ ఏజెంట్ తో పరిచయం ఏర్పడింది. ముడి పదార్ధాలతో బాంబులను చెయ్యడం, అతి లాఘవం గా వాటిని రిమోట్ కంట్రోల్ తో పేల్చడం వంటి విధ్వంసకర కార్యక్రమాలలో కూడా ఖలీద్ ట్రైనింగ్ పొందాడు. ప్రస్తుతం దేశంలో ఆరు ప్రధాన పట్టణాలలో ఆ విదేశీ గూఢచారి సంస్థ తరుఫున కార్యకలాపాలను సాగిస్తున్నాడు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో బాంబ్ బ్లాస్టింగ్ చెయ్యడం ఒక వంతయితే ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా చట్టానికి దొరకకుండా తన విధులను నిర్వర్తించడం మరొక ప్రత్యేకత. ఒకటి రెండు సంధర్భాలలో ఖలీద్ కార్యకలాపాల పట్ల ఒక పోలీస్ అధికారికి అనుమానం కలగడం వలన ఆ విదేశీ సంస్థ ప్రమేయంతో ఆ పోలీస్ అధికారిని గుట్టు చప్పుడు కాకుండా యాక్సిడెంట్ చేయించేసాడు. ఈ వ్యవస్థకే ఒక చీడ పురుగు లాంటి వాడు ఖలీద్.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|