TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
సంఘానికే వైద్యం కావాలి
- Site Administrator
< < Previous   Page: 4 of 5   Next > >  
'Sound health is the basis of sound society. Health is the foundation of all other goods, and also the means of strengthening and quickening the mind itself. The increasing dominance of mind, which constitutes progress demands a suitable and serviceable physique. For the performance of any great mark the possession of sound health is necessary. A sound mind in a sound body is a sine qua non' to the attainment of the highest excellence called bodhi.' Religion of Modern Buddhist - Lakshmi Narasu, 2002, page 204. బౌద్ధ సంఘ జీవనంలో ప్రశాంతత ఉంది కాబట్టి ఆ వైద్యులు శారీరక మానసికాంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యం చేశారు. ఇప్పటి వైద్యులే వ్యాధిగ్రస్తులు. వారి వ్యాధి ధనకాంక్ష. ఇతరుల సొమ్ము దోచి తాను ఎదగాలనే వైద్యుడు శరీరాన్ని, మనసుని బాగుచెయ్యలేడు. నిజానికి చాలా మంది ధనవంతులైన వైద్యులు తమ కుటుంబంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడే బౌద్ధం అవసరం అవుతుంది. ధనకాంక్ష ఉన్నవాడు ఏ పనినీ సరిగా నిర్వర్తించలేడు. ఏ గమ్యాన్నీ చేరలేడు. అనేక మంది డాక్టర్లు కార్పొరేట్ ముసుగులో రోగి నేపథ్యాన్ని బట్టి వ్యాధిని నిర్మూలించకుండా వ్యాధిని కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద భవంతుల్లో శునకాల మధ్య జీవించే స్త్రీలు మానవ వ్యక్తిత్వాల బింబ ప్రతిబింబత్వాన్ని కోల్పోయి ఏదో ఒక వైద్యానికి అలవాటు అవుతున్నారు. భార్యాభర్తల్లోని సాహచర్యపు లోతుల విస్త్రృతి తగ్గే కొద్దీ స్త్రీలు, పురుషులు అనేక వ్యసనాలకు గురౌవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సంఘానికే వైద్యం కావాలి. కేవలం వైద్యుడు సంఘ వైద్యం చేయలేడు. అతడు తాత్త్వికుడై ఉండాలి. మతోన్మాదులు, కులోన్మాదులు, ధనోన్మాదులు తాత్త్వికులు కాలేరు. తత్త్వం అంటే అది నిరహంకారమయ్యింది. అహం ఉన్న మనిషి తాత్వికుడు కాలేడు. అహంకారం మనిషిని వైయక్తికంగా ధ్వంసం చేస్తుంది. అహంకారంలోనే న్యూనత ఉంది. ఈ ఆత్మహత్యలు అందుకే జరుగుతున్నాయి. నన్నవమానించారు, నన్ను వేధించారు, నన్ను న్యూనత పరిచారు, నేను ఈ లోకానికి పనికిరాను అనే భావాలు సమూహ సంస్కృతికి భిన్నమయినవి. విశ్వవ్యాప్తంగా ఉన్న ఏ జంతువూ ఆత్మహత్యకు గురికావడం లేదు. ప్రకృతిని ఎదిరించి పోరాడటమే జీవి లక్షణం. సామాన్య జీవుల లక్షణాల కంటే ఇంకా అధో స్థాయిలోదే ఆత్మహత్య. ఒకనాడు యుద్ధవీరులుగా, సంఘ నిర్మాతలుగా ఉన్న స్త్రీలు ఇప్పుడు ఎందుకు ఆత్మహత్యలకు గురౌతున్నారు? పురుషుల్లోని కొందరు క్రూరజంతువులుగా వ్యవహరిస్తున్న సందర్భంలో సంఘం దాని వ్యక్తిత్వతాన్ని కోల్పోతున్నది. సంఘం అంటే వ్యక్తులు సమతుల్యంగా జీవించే వ్యవస్థ. అయితే వ్యక్తిత్వం ముఖ్యం. ఈ వ్యక్తిత్వ నిర్మాణం గురించి బౌద్ధం ఇలా అంటుంది.

Be first to comment on this Article!

< < Previous   Page: 4 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.