|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
(డాక్టర్ జి.వి. పూర్ణచంద్)
ఉత్తర పశ్చిమ భారతదేశంలో, పంజాబ్ - సింధు ప్రాంతాలలో నడిచిన నాగరికతని ఇప్పుడు సింధు సరస్వతీ నాగరికత అంటున్నారు. 'గ్రేటర్ పంజాబ్' అంటే పంచాపదేశం - ఐదు నదులు నడయాడిన ఆ ప్రాంతంలో హరప్పా మొహెంజోదారో లాంటి అనేక ప్రాచీన నగరాల అవశేషాలు కనిపిస్తాయి. సింధు సరస్వతీ నాగరికత కాలంలో అరమాయిక్, ముండా (ఆస్ట్రో ఏసియాటిక్ భాషా కుటుంబానికి చెందిన భాష), ఆర్య భాషలు మాట్లాడిన ప్రజలతో పాటు ద్రావిడ భాష మాట్లాడిన ప్రజలు కూడా కలిసి జీవించారు. అది 'పూర్వద్రావిడ - Proto dravidian' భాష కావచ్చు.
ప్రోటో ద్రావిడ భాష అంటే ఏది? :
ఉత్తర భారతదేశం, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ లలో ఇప్పటికీ స్వల్ప సంఖ్యలో ఉన్న ఉత్తర ద్రావిడ భాషలు బ్రాహూయీ, కురుఖ్ మొదలైన భాషల పూర్వరూపాన్ని ప్రోటో నార్త్ ద్రవిడియన్ భాష అన్నారు. బహుశా ఈ 'పూర్వ ఉత్తర ద్రావిడ భాష' మాట్లాడిన ప్రజలు సింధు సరస్వతి నాగరికతలో జీవించి ఉండవచ్చుననేది ఒక ఊహ. హరప్పా మొహెంజొదారో నగరాలు క్రీ.పూ. 2500-1700 మధ్య కాలంలో వైభవంగా ఉన్నాయని చరిత్రవేత్తలు భావిస్తున్నారు. ప్రొటో నార్త్ ద్రవిడియన్ భాష విడివడిందనీ, తెలుగు భాష ఇందులోంచి ఏర్పడిందనీ ఆ తర్వాత క్రీ.పూ. 1000 నాటికి ప్రోటో సదరన్ ద్రవిడియన్ భాష విడివడిందనీ తమిళ, కన్నడ భాషలు ఇందులోంచి ఏర్పడ్డాయనీ కొందరు భాషావేత్తలు చెప్తున్నారు. ఈ మూడు భాషలకూ మధ్య ఒక్కో దానికి వెయ్యి ఏళ్ళు విరామం ఊహించుకున్నా తమిళానికి వెయ్యేళ్ళ ముందే తెలుగు ఏర్పడి ఉండాలి. తమిళ భాష ఏర్పడే కాలానికి సింధు నగరాలు పూర్తిగా పతనమైపోయాయంటాడు బెర్నార్డ్ సార్జెంటా. తెలుగు భాష సింధు నగరాల చరమాంకాన్ని చూసి ఉండవచ్చు.
అయితే ప్రొటో ద్రావిడ అనే పదాన్ని చరిత్రవేత్తలు ఎక్కడ వాడినా దానిని తమిళులు ప్రోటో తమిళ శబ్దంగా మార్చటం మొదలుపెట్టారు. తమిళ భాష మద్రాసు రాష్ట్రం నుంచి ఆఫ్రికా ద్వారా వ్యాపించిందనే ఒక బలమైన నమ్మకాన్ని తమిళ పరిశోధకులు గట్టిగా కల్గించగలిగారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|