|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
ద్రావిడులకు గ్రీకులతో సంపర్కం :
ఏప్రియల్ 29, 2009న తన సొంత వెబ్ సైట్లో క్లయిడ్ అహ్మద్ వింటర్స్ తన ప్రతిపాదనలన్నింటినీ 'Greek & Tochanian' పేరుతో ఒక వ్యాస రూపంలో ఉంచాడు. ఆసక్తి కలవారు దానిని చూడవచ్చు. అలాగే మైకేల్ విజ్జెల్ (Michael Witzel) వ్యాసాలుగా కూడా ఆయన వెబ్ సైట్ లో చదువుకోవటానికి ఉచితంగానే దొరుకుతాయి. విజ్జెల్ ఆన్ లైన్ లో వేదిక జర్నల్ ని కూడా నడుపుతున్నాడు. విజ్జెల్ ని వింటర్స్ ని బెర్నార్డ్ సార్జెంట్ ని చదివితేనే భాషా చారిత్రక విషయాల తాజా పరిశోధనల్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. అందుకు ఇంటర్నెట్ కి వెళ్ళడం తప్పనిసరి! పుస్తకరూపంలో వచ్చినట్లు కన్పించదు.
వింటర్స్ మరో అడుగు ముందుకెళ్ళి గ్రీస్ లో యూరోపియన్ జాతుల ప్రాబల్యం పెరగటానికి ముందు అక్కడ ద్రవిడులు నివసించారని, గ్రీకులోకి ఇతర ఇండో యూరోపియన్ భాషలలోకి ద్రవిడ పదాలు ఆ సమయంలోనే ప్రవేశించాయనీ అంటాడు.
ఇంగ్లీషు పదాలకు దగ్గరగా ధ్వనించే తెలుగు పదాలను కొన్నింటిని ఇందుకు సాక్ష్యంగా మనం కూడా చూపించవచ్చు.
మేత : Meat
వ్రాత : Write
పీలిక : Peel
విల్లి, పల్లి : Village (అరసవిల్లి, కొండపల్లి)
పావి (ప్రోవు) : Pale
విలువ : Value
పొడి : Powder
వ్రక్క : Break
పడక : Bed
మిక్కు, మిక్కిలి : Much
చిక్కనిది : Thick
ఈదరి : Hithen to
1939లో తేకుమళ్ళ రాజగోపాలరావు 104 తెలుగు పదాలు ఇలా ఇంగ్లీషుకు దగ్గరగా ఉన్నవాటిని ఎత్తి చూపించారు. Early Stone Age (తొలి కంచు యుగంతో) గ్రీకులతో ద్రవిడులకు సమీప వ్యక్తిత్వం ఇందుకు కారణం కావచ్చునని వింటర్స్ పేర్కొన్నాడు.
ఆంథ్రపాలజీ అంటే మానవశాస్త్రం. Anthropology ఆంథ్రోస్ అనే గ్రీకు పదానికి మనిషి అని అర్థం. పూర్వం ఇండో యూరోపియన్ భాషలో 'అంధ్' (Andh) శబ్దానికి మనిషి అని అర్థం. ఇండో యూరోపియన్ భాషా కూటమికి చెందిన వైదిక సంస్కృత భాషా ప్రజలు తెలుగువారిని 'అంధ' శబ్దంతోనే అంధకులని వ్యవహరించారు. దీనికి వింటర్స్ చెప్పిన గ్రీకు ద్రవిడియన్ల సమీప వ్యక్తిత్వం కారణం కావచ్చు. గ్రీకు బాక్ట్రియాని జయించిన తర్వాత బాక్ట్రియాలో గ్రీకు భాష, ద్రవిడ భాష కలిసి తొకారియన్ భాష ఏర్పడిందని ఉత్తర పశ్చిమ భారతదేశంలో రాజ్యం చేసింది ఈ బాక్ట్రియన్ గ్రీకులేననీ వింటర్స్ పేర్కొన్నాడు. ఇండో యూరోపియన్ భాషల్లో అనేక ద్రావిడ పదాలు ఉంటడానికి ద్రావిడులతో గ్రీకు సంపర్కం గురించి వింటర్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. అప్పటికే తెలుగు భాష ఒక ప్రత్యేక భాషగా రూపుదిద్దుకోవటం మొదలుపెట్టి ఉంటుందని కూడా మనం వింటర్స్ మాట్లలోంచి గ్రహించవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|