|
|
Articles: Devotion | మణిదీప వర్ణన - Site Administrator
| |
మహాశక్తి మణిద్వీపనివాసిని
ముల్లోకాలకు మూలప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి
మనమనసులలో కొలువైయింది
సుగంధ పుష్పాలెన్నోవేలు
అనంతసుందర సువర్ణ పూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహా నిధులు
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు
పారిజాతవన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం
దేవ దేవుల నివాసము అదియే కైవల్యం
పద్మరాగములు, సువర్ణమణులు
పది ఆమడలు పొడవునగలవు
మధుర మధురమగు చందనసుధలు
మణిద్వీపానికి మహానిధులు
అరువది నాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు
అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టిదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు
కోటిసూర్యల ప్రచండకాంతులు
కోటింద్రుల చల్లని వెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు
మణిద్వీపానికి మహానిధులు ||భువనే||
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|