|
|
Articles: Devotion | మణిదీప వర్ణన - Site Administrator
| |
మంత్రిణి దండిని శక్తి సేనలు
కాళికరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
సువర్ణ రజిత సుందరగిరులు
అనంగదేవి పరిచారకులు
గోమేధికమణి నిర్మితగుహలు
మణిద్వీపానికి మహానిధులు
సప్తసముద్రములనంత నిధులు
యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు
మానవ మాధవదేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణ మూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
కోటిప్రకృతుల సౌందర్యాలు
సకలవేదములు ఉపనిషత్తులు
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు
పంచభూతముల యజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు
సంతానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు ||భువనే||
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|