|
|
Articles: Devotion | మణిదీప వర్ణన - Site Administrator
| |
చింతామణులు నవరత్నాలు
నూరామడలు వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు
దు:ఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు
పదునాల్గులోకాలన్నిటిపైనా
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపం
సర్వేశ్వరికది శాశ్వత స్థానం - 2
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివశిస్తాడు మణిద్వీపములో - 2
మణిగణఖచిత ఆభరణాలు
చింతామణిపరమేశ్వరిదాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో -2
పరదేవతను నిత్యముకొలిచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది - 2
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిమార్లు
చదివినచాలు అంతాశుభమే
అష్టసంపదల తులతూగేరు -2
శివకవితేశ్వరి, శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా
కోటిశుభాలను సమకూర్చుటకై - 2 ||భువనే ||
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|