|
|
Articles: Short Stories | కోరిక - Mr. Devender Chintala Devender
| |
ఇహ కష్టాలు ప్రారంభం కాసాగాయి.
ఇన్ని రోజులు కృష్ణుడి అండదండలు దండిగా ఉండటం వల్ల కాబోలు హాయిగా ఉన్న సత్య ఈ మధ్య బెంగపడసాగింది. తన బాబు ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, స్తబ్ధుగా, నిస్తేజంగా పడి ఉండటం భరించలేకపోతుంది. కారణాలు ఎంతగా ఆలోచించినా గోచరించడం లేదు. తన చెలికత్తెలతో విచారించింది కృపుడి అనారోగ్య పరిస్థితికి కారణమేమై ఉంటుందని. వారూ ఏమి చెప్పలేకపోయారు.
ఆలోచనలో పడిపోయింది. విచారంలో తన ఆరోగ్యం సైతం దిగజారడం గమనించింది సత్య.
కృపుడు రోజురోజుకీ బలహీనం కాసాగాడు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఠక్కున గుర్తొచ్చింది సత్యకి ఎన్నో రోజులుగా తన సఖుడైన శ్రీకృష్ణుడ్ని తన మదిలో సైతం తల్చుకోకపోవడం.
ఎంతగానో బాధపడింది. కృష్ణుడు చెప్పింది తనకి మెల్లిమెల్లిగా గుర్తుకు రాసాగింది.
అవునూ, తనే సంతానం కావాలని కోరింది. కాదూ కూడదని బెట్టు చేయడం, చివరికి కనికరించి సంతానాన్నిచ్చిన పతినే ఇంతవరకూ తలవకపోవడం, తనూ దూరమవుతాన్న మాట సైతం గుర్తుకొచ్చి బాధపడి ఎంతో వేదనకి గురి అయింది సత్య.
ప్రేమాభిమానాలున్నవారిని నిరాదరణ చేస్తే దూరం కాక తప్పదని, తన అపోహల నుంచి దూరం కావడానికి ప్రయత్నించింది సత్య.
మెల్లిగా తనను ఆవరించుకున్న మాయలు నీలినీడలు విడిపోసాగాయి. నిరంతరంగా కృష్ణుడ్ని తన మదిలో నిలుపుకోవడంతో నీలినీడల్లోంచి మందహాసంతో అరుదెంచాడు శ్రీకృష్ణుడు. అంతవరకూ అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి మారిపోయి బృందావనం నందనవనమైపోయింది. సత్య సంతోషపడింది గోవిందుడి రాకకి.
అంతదాక బలహీనంగా ఉన్న కృపుడు అంతర్ధానమయ్యాడు. శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయాడు.
తన బాబుకై వెతుకుతున్న సత్యకి తన చిరునవ్వుతో సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు - 'సత్యా! మాయామోహంలో పడిన వారికి సుఖశాంతులుండవని’.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|