|
|
Articles: TP Features | రేపు ఎవరికి తెల్లారేను? - Site Administrator
| |
'రేపటి వ్యక్తిగత డిజిటల్ సాధనం ఏమిటనేదే మహాభారతం'. మరింత మెరుగులు దిద్దిన మొబైల్ ఫోనా లేక టెలిఫోన్ కలగలిసిన పామ్ టాపా? ఈ చిన్న సమరాలే పెద్ద సమరంగా పరివర్తనం చెందుతాయి. వీటన్నిటి వెనుక తలమానికమైన ప్రశ్న ఒకటి ఉంది -
'నా పోటీదారు ఎక్కడ?'
నేను అప్పుడప్పుడు నా విద్యార్థులను సందిగ్ధంలో పడవేయడానికి ఒక ప్రశ్న సంధిస్తుంటాను. 'సోనికి యాపిల్ ఏ నష్టం కలిగించింది, కోడక్ ను సోని ఏ దెబ్బ తీసింది, వివరించండి?' తెలివైనవారు వెంటనే సమాధానం ఇస్తుంటారు. సోని ఆడియో (వాక్ మన్ నుంచి సంగీతం)ని తన మార్కెట్ గా నిర్వచించింది. యాపిల్ వంటి ఐటి సంస్థ తమ ఆడియో రంగంలోకి చొచ్చుకు వస్తుందని అది ఎనాడూ ఊహించలేదు. మరి ఇది ఆశ్చర్యకరంగా లేదూ? కంప్యూటర్ తయారీదారుగా యాపిల్ కు ఆడియో, వీడియో సామర్థ్యాలు రెండూ ఉన్నాయి. కేవలం ఆడియోతో అది తనకు పోటీదారు కాదని సోని ఎలా భావించింది? 'చాలా చిన్న కారణం'. అలాగే కోడక్ ఏమంది .. ఫిలిమ్ కెమెరాలే తన ప్రధాన వ్యాపారం అని పేర్కొన్నది. ఇప్పుడు సోని 'డిజిటల్'ను తన ప్రధాన వ్యాపారంగా పేర్కొంటున్నది.
డిజిటల్ కెమెరాలో రెండు మార్కెట్లు పక్కాగా కలగలిసిపోయాయి. అయితే, డిజిటల్ రంగంలోకి ప్రవేశించి కెమెరా ఫిలిమ్ పై డబ్బు త్యాగం చేయాలా లేక ఫిలిమ్ వ్యాపారంలోనే కొనసాగి డిజిటల్ టెక్నాలజీలో వెనుకబడిపోవాలా అనేది తేల్చుకోలేక కోడక్ సతమతం అయింది. చివరికి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోవడంతో అది రెంటికీ చెడ్డ రేవడి అయింది. అది అలా కావలసి వచ్చింది. 'రేపటి నా ప్రత్యర్థి ఎవరు' అనే ప్రశ్నను అది అడగలేదు. ఐబిఎం విషయంలోనూ ఇదే జరిగింది. మెయిన్ ఫ్రేమ్ ఆదాయం వల్ల అది పిసిపై దృష్టి సారించలేదు. 'ఇంటర్నెట్ వ్యామోహం వంటిది' అని ప్రకటించిన బిల్ గేట్స్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన ఆ తరువాత తన విధానం మార్చుకుని వెట్ స్కేప్ ను నొక్కివేయడానికి విండోస్ తో బ్రౌజర్ ను నింపేశారు.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఈనాటి పోటీదారు ఎవరనేది కాదు.
పోటీదారు ఎవరో తెలుసు.
రేపటి పోటీదారు ఎవరనేదే తెలియదు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|