|
|
Articles: TP Features | రేపు ఎవరికి తెల్లారేను? - Site Administrator
| |
2008లో ఇండియాలో బ్రిటిష్ ఎయిర్ వేస్ కు గట్టి ప్రత్యర్థి ఏది? సింగపూర్ ఎయిర్ లైన్స్? లేదా ఇండియన్ ఎయిర్ లైన్స్? కావచ్చు. అయితే, ఇంకా మెరుగైన జవాబులు ఉన్నాయి. ఈ విమాన సంస్థలకు, ఇక్కడ ప్రస్తావించని ఇతర సంస్థలకు నష్టం కలిగించగల పోటీ సంస్థలు ఉన్నాయి. అవి రవాణాకు సంబందించినవి కావు. అవి ఏమిటంటే హెచ్ పి, సిస్కో టెలిప్రెజెన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు-- ఆర్థిక మాంద్యం కారణంగా ప్రయాణాలు తగ్గిపోయాయి. దేశ, విదేశాలలోని సీనియర్ ఐటి ఎగ్జిక్యూటివ్ లు ప్రయాణ బడ్జెట్ ను కుదించేందుకై వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాన్ని ఉపయోగించేట్లుగా ఆ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒత్తిడి చేశాయి. దీనితో అమరికన్ వీసాల కోసం భారతీయ టెకీల క్యూ 2008లో కనిపించనే లేదు. (అమెరికాకు వెళ్ళేందుకు ఇండియాకు కేటాయించిన వీసాల సంఖ్య సుమారు 65 వేలు. ఆ కోటానే మిగిలిపోయింది. ఇందుకు ఆర్థిక మాంద్యమే కారణం). ఇంతవరకు ఫర్వాలేదు. అయితే, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడుతున్నందున విమాన సంస్థల వ్యాపారం తిరిగి పెరుగుతుందా అని ప్రశ్నిస్తే అంత నమ్మకంగా జవాబు చెప్పలేం. సమీప భవిష్యత్తులో అయితే అవుననే చెప్పవచ్చు. కాని దీర్ఘ కాలంలో అయితే కాదనే అనాలి.
న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం వర్తించే రంగం భౌతిక శాస్త్రం కాకుండా మరేదైనా ఉందా అంటే అది ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు దాదాపుగా కనిపించని విసిఆర్ ల (బ్లూ రే డిస్క్ ప్లేయర్ కు తండ్రి వంటిదనవచ్చు) 1971, 1991 మధ్య ధరలు ఇండియాలో మొదట్లో ఉన్న స్థాయి కన్నా బాగా పడిపోయాయి. పిసిల ధర వందల వేల రూపాయల నుంచి పదుల వేల రూపాయలకు పడిపోయింది. ఇదే సరళి కొనసాగినట్లయితే, టెలిప్రెజెన్స్ ధరలు కూడా పతనం కాగలవు. అప్పుడు విమాన సంస్థల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. వాటికి భవిష్యత్తు శూన్యం కావచ్చు!
ఇండియాలో రెండింటిపై మోజు హెచ్చు. సినిమాలు, క్రికెట్. ఈ రెండు మార్కెట్లు పూర్తిగా భిన్నమైనవి. ఆరాధనీయులైన వీటి ప్రముఖులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. క్రికెట్ దేవుళ్లు సచిన్, సెహ్వాగ్. ఇక సినీ దేవుళ్లు ఖాన్ లు (ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇతర ఖాన్ లు). క్రికెట్ అంటే మౌలికంగా టెస్ట్ క్రికెట్, మహా అయితే 50 ఓవర్ల క్రికెట్ గా భావించిప్పటి మాట అది. ఆ తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆవిర్భవించింది. ఈ రెండు మార్కెట్లు పతనమై ఒకటిగా మిగిలాయి. ఐపిఎల్ క్రికెట్ ను 20 ఓవర్లకు కుదించింది. హఠాత్తుగా ఐపిఎల్ మ్యాచ్ 3 గంటల చిత్రం నిడివికి తగ్గిపోయింది. ఫలితంగా సినిమాకు క్రికెట్ పోటీదారుగా మారింది. ఐపిఎల్ పోటీల సమయంలో సినిమా హాళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనితో దిక్కుతోచని మల్టిప్లెక్స్ ల యజమానులు వీక్షకులను ఆకర్షించడానికి సినిమా హాళ్లలో ఐపిఎల్ పోటీలను చూపించేందుకు హక్కులు సంపాదించారు. ఐపిఎల్ క్రికెట్ కు ఊపిరిగా మారిపోతుండగా, ఐపిఎల్ పోటీల తేదీలలో చిత్రాల విడుదలను ఆపుకోవలసి వస్తున్నది. ఇక వీక్షకులకు సంబంధించినంత వరకు, ఇండియాలో ఈ రెండింటినీ 3 గంటల 'తమాషా' (వినోదం)గా పేర్కొంటున్నారు. క్రికెట్ సీజన్ సినిమాలను మార్కెట్ లో నుంచి వెనుకకు నెట్టివేయవచ్చు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|