TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
థర్టీన్ ఫోబియా!
- Site Administrator
< < Previous   Page: 3 of 3    
ఇక తమిళులకు 13, 8 అంకెలు అశుభం. ఈ భయం ఎంతలా వ్యాపించిందంటే చివరకు తమిళనాడు వాహనాల రవాణా శాఖ కూడా అంకెలన్నీ కూడితే 8 వచ్చే సంఖ్యలను అన్ని రిజిస్ట్రేషన్ నంబర్ల జాబితా నుంచి మినహాయించింది. మొత్తం కూడితే 8 వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ కావాలని ఎవరైనా ప్రత్యేకంగా కోరితే తప్ప ఆ నంబర్ ను ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఈ అశాస్త్రీయ మూఢవిశ్వాసాన్ని పాటిస్తుంటే నంబర్ల గేము ఆడుతున్నారని బిల్డర్లను ఎలా తప్పుపడతారు? 'చాలా మంది 13 లేదా 8 (శనికి సంబంధించినదనే భయం) అంకె ఉన్న అపార్ట్ మెంట్లను కొనుగోలు చేయరు. కాని కొందరు మద్యం వ్యాపారులు ఈ రెండు అంకెలను ఇష్టపడతారు. ఇటువంటి ఆస్తులు సొంతం చేసుకోవడానికి వారు ఎంత మొత్తమైనా చెల్లిస్తారు' అని సోహైల్ సరూషి అనే రియల్టర్ చెప్పారు. అంతర్జాతీయ ఆతిథ్య ప్రమాణాలకు తగినట్లుగా ఉండడానికి పలు భారతీయ ఫైవ్ స్టార్ హోటళ్లలో 13వ నంబర్ గది ఉండదు. 13వ నంబరుతో అంతస్తు కూడా ఉండదు. ముంబై నారిమన్ పాయింట్ లోని ట్రైడెంట్ హోటల్ ఇందుకు ఒక ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయని అమెరికాలోని హయట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ కు చెందిన కేటీ రాకాఫ్ చెప్పారు. 'మా అతిథులు సుఖంగా ఉండేట్లు చూడడం మా ధ్యేయం. అందుకే 13వ నంబర్ గది ఉండదు' అని ఆమె తెలిపారు. 'చైనాలో 4 అంకె అశుభం. 8 అంకె శుభప్రదమైనది. బీజింగ్ లో ఒలింపిక్ క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమం 08-08-08 తేదీన జరిగింది. 88 టాప్ లెవెల్ అంతస్తు కావాలని కోరుకున్నందున చైనాలో ఒక హోటల్ వారు 22వ అంతస్తు తరువాత 88వ అంతస్తుగా పేర్కొన్నారని నేను విన్నాను' అని ఆమె తెలిపారు. ముంబైలో ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ డెవలపర్లుగా ఉన్న వర్ధమాన్ గ్రూప్ ఎండి రాజేష్ వర్ధన్ వంటి బిల్డర్లకు 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లు విక్రయించడం బృహత్ కార్యం వంటిది. 'ఇళ్ల కొనుగోలుదారులలో దాదాపు పాతిక శాతం మందికి ఈ అంతస్తు అంటే భయం' అని ఆయన తెలిపారు. అయితే, ఈ మూఢవిశ్వాసానికి దూరంగా ఉండేవారూ లేకపోలేదు. తమ వద్దకు వచ్చే కొనుగోలుదారులలో 30 శాతం మందికి ఈ నంబర్ గేమును పట్టించుకోరని డెవలపర్ గా మారిన ప్రకటనకర్త ప్రకాశ్ శర్మ (ప్రాంజీ, ముంబై) చెబుతున్నారు. 'ఈ మార్పులు చేయవలసిన అవసరం నాకు రాదు' అని ఆయన చెబుతున్నారు. 'జ్యోతిష, వాస్తుపరమైన సూచనలతో వచ్చే కస్టమర్లు ఉన్నారు. కర్మను నమ్ముకున్న కొనుగోలుదారులూ ఉన్నారు' అని ఆయన వేదాంత ధోరణిలో చెప్పారు. కొసమెరుపు : ఇదిలా ఉండగా, క్రైస్తవ సంప్రదాయంలో దురదృష్టకర సంఖ్య 13ను లాస్ట్ సప్పర్ కు హాజరైన అతిథుల సంఖ్యతో ముడిపెట్టారు. ఇక సర్ విన్ స్టన్ చర్చిల్ శుక్రవారం 13వ తేదీన ఎన్నడూ ప్రయాణం చేయలేదు. నెపోలియన్ కూడా అంతే. అపోలో 13 ఉపగ్రహం చంద్రమండల యాత్రను 1970 ఏప్రిల్ 13న 13.13 గంటలకు ప్రారంభించి, అర్ధంతరంగా ముగించారు. 'అది ఏప్రిల్ నెలలో ఎంతో చలిగా ఉన్న రోజు. గడియారాలు 13 గంటలు కొట్టాయి'. జార్జి ఆర్వెల్ రచించిన '1984' గ్రంథంలో మొదటి వాక్యం అది.

Be first to comment on this Article!

< < Previous   Page: 3 of 3    



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.