|
|
Articles: TP Features | థర్టీన్ ఫోబియా! - Site Administrator
| |
పాశ్చాత్య దేశాల నుంచి ఈ భయం 'వ్యాధి' చివరకు ముంబైలో అత్యంత విలాస ప్రాంతమైన నారిమన్ పాయింట్ కు కూడా వ్యాపించింది. ఆ ప్రాంతంలో హెస్ట్, మేకర్ చాంబర్స్, అట్లాంటా వంటి పలు ఆకాశహర్మ్యాలలో ఏ అంతస్తులోనూ 13 అంకె కనిపించకుండా చేశారు. ఆ అంకెను మాయం చేస్తూ ఎలివేటర్ స్విచ్ బోర్డులో రెండు వరుస సరి సంఖ్యలు ఉంటాయి. 1974లో అట్లాంటా ఆకాశహర్మ్యాన్ని నిర్మించిన బిల్డర్ కుటుంబం రామచందానీలు 13వ అంతస్తులో మినహా మరెక్కడైనా ఆఫీసు స్థలం కోసం వర్ధమాన కొనుగోలుదారుల నుంచి పుంఖానుపుంఖంగా లేఖలు వచ్చాయని చెప్పారు. '13వ అంతస్తులో దేనిని కొనుగోలు చేయడానికీ ఎవరూ సుముఖంగా లేరు. అందువల్ల దానిని 14వ అంతస్తుగా తిరిగి పేర్కొన్నాం' అని రామచందాని తెలిపారు.
మూఢవిశ్వాసాలతో ఉన్న కొనుగోలుదారుల భయాలను పారదోలాలని అనుకున్న డిఎల్ఎప్, ఓమాక్స్, సహారా వంటి బిల్డర్లు కాన్పూరుకు చెందిన జ్యోతిష్కుడు పండిత్ ఆదిత్య పాండేను నిరంతరం సంప్రదిస్తుంటారు. అమ్ముడుపోకుండా ఉన్న 13వ అంతస్తు స్పేస్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న బిల్డర్లు చివరగా ఆశ్రయించేది ఆయననే. లక్నోలోని ఓమాక్స్ సిటీ బిల్డర్లు తన సాయాన్ని కోరిన ఒక ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 'కొనుగోలుదారులు తప్పించుకుంటున్న 13వ లేన్ లోని కాటేజీలను ఎలా విక్రయించాలో వారికి పాలుపోలేదు' అని పాండే తెలిపారు. పాశ్చాత్య చానెల్స్ ద్వారా భారతీయులను పట్టిపీడిస్తున్న ఒక భయం 13 అంకె అని ఆయన పేర్కొన్నారు. 'వేద జ్యోతిశ్శాస్త్రంలో 13 అంకె శుభప్రదం' అని ఆయన చెప్పారు. 'నవ గ్రహాలు, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆదిపరాశక్తి సమాహారమే ఆ సంఖ్య' అని ఆయన వివరించారు.
తుదకు ఎలివేటర్ సంస్థలకు కూడా 13 అంకె భయం పట్టుకున్నది. ఓటిస్ ఎలివేటర్లు ఉన్న భవనాలపై జరిపిన సమీక్షలో ప్రపంచంలోని ఆకాశహర్మ్యాలలో 85 శాతం భవనాలలో 13 అంకె ఉన్న అంతస్తు ఉండదు. 'ఇది ప్రపంచమంతటా వ్యాపించిన మూఢ విశ్వాసం. ఇండియా ఇందుకేమీ మినహాయింపు కాదు' అని ఓటిస్ సంస్థ అధికార ప్రతినిధి దిలీప్ రంగ్నేకర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ లో ఫ్లిక్కర్, యూట్యూబ్ వంటి పాపులర్ వెబ్ సైట్లలో 13 అంకె లేని ఎలివేటర్ ప్యానెల్స్ ఫోటోలు, వీడియోలు వేలాదిగా పొందుపరిచారు. చివరకు ప్రముఖ అమెరికన్ హాస్య నటుడు మిచ్ హెడ్బెర్గ్ కూడా 13వ అంతస్తుపై చమత్కార వ్యాఖ్యలు చేశారు. 'మూఢ విశ్వాసం కారణంగా నా హోటల్ లో 13వ అంతస్తు లేదు. అయితే, 14వ అంతస్తులో ఉన్నవారికి వారు నిజంగా ఏ అంతస్తులో ఉన్నారో తెలుసా. మరి ఏ రూములో ఉన్నారో తెలుసా? 1401. లేదు మీకు తెలియదు. ఆత్మహత్యకు కిటికీలో నుంచి దూకండి. మీరు తొందరగా చనిపోతారు!' అని ఆయన పేర్కొన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|