|
|
Articles: TP Features | క్షమించు యాదయ్యా.. - Site Administrator
| |
యాదయ్య మరణ వార్తకు సీమాంధ్ర యాజమాన్యంలో ఉన్న మీడియా సహజంగానే పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. హిందూ దినపత్రికలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. సాక్షితో పాటు ఒకటి రెండు పేపర్లలో ఈ వార్తను ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో యాదయ్య వార్త లేనేలేదు. సరే అది మీడియా ఎప్పుడూ చూపే వివక్షతనే. ఆయన స్వయంగా అంటించుకున్నాడా, ఇతరులెవరైనా అంటించారా లాంటి అర్థం లేని ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధిని విద్యార్థులు కొట్టినంత పని చేశారు. వైష్ణవి కిడ్నాప్ పై స్పందించినట్లుగా యాదయ్య పట్ల మీడియా స్పందించకపోవడంలో వారి వైఖరి తేటతెల్లం అవుతున్నది. కాగా, ఈ ఘటనలో పోలీసులు పరమ దుర్మార్గంగా, అనైతికంగా, చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు.
సాధారణంగా ఒక వ్యక్తి ఎంతగా కాలినా ఆ గాయాలతో 24 గంటల తరువాతే మరణిస్తాడు. కాని యాదయ్య 12 గంటలు గడిచీ గడవగానే మరణించాడు. కారణం తెలువదు. యాదయ్య బ్రతికితే అతను బాగుపడి బయటికి రావడానికి కనీసం రెండు నెలలు అయినా పడుతుంది. ఈ రెండు నెలలు ఆసుపత్రి ముందు టెంట్లు వేసి, దీక్షలు చేసి నానా హడావిడి చేస్తారు. నాయకులు పరామర్శించడానికి వస్తారు. దీంతో మీడియా వారి హడావుడి, ఉద్యమకారుల గోల ఇవన్నీ ఎందుకని ముందుగానే గుట్టుచప్పుడు కాకుండా 'యాదయ్య కథకు ఆ రాత్రి ముగింపు పలికితే ఏ గొడవా ఉండదు కదా' అని పోలీసులు భావించి ఉండవచ్చు. లేదా యాదయ్యనే కాలిన గాయాలతో మరణించి ఉండవచ్చు. అటువంటప్పుడు యాదయ్య శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించినట్లు? మీడియా వారికి ఎందుకు ఎరుకపరచనట్లు?
సాధారణంగా ఎవరైనా ఇలా కాలిన గాయాలతో ఏ ఆసుపత్రిలో మరణించినా పోస్ట్ మార్టం చేయడానికి శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా రాత్రికి రాత్రి పోస్ట్ మార్టం చేయరు గాక చేయరు. మరి యాదయ్యను రాత్రికి రాత్రి ఆయన సొంత ఊరికి ఎలా తరలించారు? పోలీసులకు 'ఈ ఆలోచన' ముందే ఉంది కాబట్టే యాదయ్యను ఆయన స్వగ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న డిఆర్ డిఎల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అటు నుంచి అటే శవాన్ని మూడో కంటికి తెలియకుండా తరలించారు. 85% కాలిన శరీరంతో ఎలాగూ చనిపోయేవాడే కదా అని ముందే 'ఆ పని కానిచ్చే' అవకాశం ఉంది. ఈ విషయమై తెలంగాణ వాదులకు తీవ్రమైన అనుమానాలున్నాయి. ఈ ఉద్దేశ్యం ఉంది కాబట్టి యాదయ్యను పోలీసులు డిఆర్ డిఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు అన్నది వారి ఆరోపణ.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|