|
|
Articles: TP Features | తెలుగు భాషకు భూషణం - Site Administrator
| |
సంస్కృతం అన్ని భాషలకు తల్లి లాంటిదయినా, తెలుగు మీద అది ఎంత ప్రభావం చూపినా తెలుగు భాషకు తనదే అయిన పదజాలం ఉందని స్పష్టంగా చెప్పాడు కేతన. అందువల్ల తెలుగుకు తనదైన అస్తిత్వం ఉందని, సంస్కృతంతో కలవడం వల్ల దానికి పటుత్వం కలిగిందని స్పష్టం చేశాడు కేతన.
తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును
దాని వలన గొంత గానబడియె
గొంత తాన కలిగే నంతయు నేకమై
తెలుగు బాస నాగ వినుతికెక్క.
తెలుగులో తత్సమములు మాత్రమే నేరుగా సంస్కృత ప్రాకృతాల నుండి వచ్చినవి. ఇక మిగిలినవన్నీ తెలుగుకు సహజమైనవని అందరూ భావిస్తూ వచ్చారు. తెలుగు భాషలో తత్సమము, తద్భవము, అచ్చతెనుగు, దేశ్యము, గ్రామ్యము అని ఐదు రకాలున్నాయన్నాడు కేతన.
తల - నెల - వేసవి - గుడి - మడి - పులి - చలి - మడుగు - ఊరు - పేరు - బూరుగు - మగవాడు - అలుక - ఇలాంటి అందరికీ తెలిసిన పలుకులు అచ్చ తెలుగు అని చెప్పాడు కేతన. దేశి తెలుగులని, దేశ్యంపు తెలుగులని ఈ కవి ఇచ్చిన పట్టీ కూడా అచ్చ తెలుగే. తెలుగు వారికి తమదంటూ చాలా పదజాలం ఉందని కేతన స్పష్టం చేశాడు. అంతేకాదు, మాండలికం కూడా తెలుగులో ఒక భాగమే అని, అది కూడా తెలుగు వారి వ్యవహారంలో భాగమే అనీ సూచించాడు ఈ కవి. పంపేరు - తెంపేరు - పాడేరు - సూసేరు - ఇందాము - కందాము - అషువలె - ఆడ - ఈడ - ఏడ - ఉండాడు మొదలైనవన్నీ వ్యవహారంలో ఉన్నాయని తెలిపాడు. సంస్కృత సంధుల్ని, సమాసాల్ని తెలపడంతో బాటు చలిగాడ్పు - నల్లకలువలు - వలవంతలు - తెల్లదమ్మి - ఎలమావి - కెంజిగురు - అలరమ్ములు వంటి తెలుగు సమాసాలను కూడా ఉదాహరణలుగా ఇచ్చాడు. తెలుగు క్రియలను వివిధ కాలాలలో ఎలా ఉపయోగించాలో తెలిసిన కేతన తెలుగును ఎన్ని విధాలుగా ఉపయోగించటానికి వీలుందో సూచించాడు. పలికెను - పలికిరి - పలికితివి - పలికితి - పలికితిరి - పలికతిని - పలికితిమి - పలుకుట - పలికించుట లాంటి వివరాలను మనకందించాడు.
ఆ నాటికి కేతన తెలుగు భాషకు చేసిన సేవ చాలా గొప్పది. తెలుగు భాష ఎన్ని విధాలుగా, ఎన్ని కావ్యాలుగా, ఎన్ని శాస్త్రాలుగా, ఎన్ని వీరగాథలుగా, సామెతలుగా పరిపూర్ణ స్వరూపంతో వికసించిందో తెలుసుకోవాలంటే తెలుగు కోసం శ్రమించిన ప్రతి కవీ మాన్యుడే, మననం చేసుకోదగినవాడే.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|