|
|
Articles: TP Features | 'శ్రీకృష్ణ' ముందున్న సవాళ్లు - Site Administrator
| |
ఇక రెండవ సమస్య - రాష్ట్రంలో అధికార వ్యవస్థీకరణ జరిగిన తీరు. 1982 - 83లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఉత్థానం రాష్ట్ర రాజకీయాలలో ఒక మలుపునకు ప్రతీక అయింది. టిడిపి హయాంలో అధికార కేంద్రీకరణ జరిగింది. సాంఘికపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన అధికారం ఒకే చోట సమీకృతమైందనేందుకు టిడిపి ఒక సూచిక. ఎన్టీఆర్ రాచరికం తరహాలో పాలన సాగించారు. ఆ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అదే పంథా అనుసరించారు.
డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ వర్గాల బలం ఎటువంటిదో దృగ్గోచరమైంది. ఈ వర్గాలు చివరకు అధిష్ఠానవర్గాన్ని కూడా సవాల్ చేశాయి. ఎదురు వ్యూహంతో ఈ వర్గాలను కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తాత్కాలికంగా అణచివేసింది. కాని శక్తిమంతమైన కులాల నుంచి రాని ప్రస్తుత ముఖ్యమంత్రిని ఈ వర్గాలు పని చేయనివ్వడం లేదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల రాజకీయాలకు విరుద్ధమైన రీతిలో తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని కమిటీ సూచిస్తుందని భావించినప్పటికీ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ శక్తిమంతమైన కులాలు ఆయనను పని చేయనిస్తాయా? మరొక విధంగా ప్రస్తావించాలంటే, ఈ వర్గాల సాంఘిక, ఆర్థిక అధికారానికి దీటైన రాజకీయ అధికారం కల్పిస్తూ ఒక సూత్రాన్ని రూపొందించగలమా?
ఇక మూడవది - తెలంగాణ ప్రాంతం ప్రజల అస్థిత్వానికి సంబంధించిన సవాల్. తమ సంస్కృతి, భాష, పండుగలు, ఆహార పద్ధతులు, గుర్తులు, తమ పోరాటాలు, త్యాగాల చరిత్ర వంటి అంశాలను అలక్ష్యం చేశారని తెలంగాణ ప్రాంతంవారు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం, వారి సాంస్కృతిక పద్ధతులు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంటాయి. 21వ శతాబ్దం ప్రథమార్ధం గుర్తింపు రాజకీయాల శతాబ్దంగా కమిటీ గ్రహించాలి. సైద్ధాంతిక రాజకీయాల స్థానాన్ని అవి ఆక్రమిస్తున్న దృష్ట్యా ఇది తప్పసరి పరిణామం కాదు కాని చారిత్రక వాస్తవం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|