TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
ఉసురు తీస్తున్న ఓటమి
- Site Administrator
  Page: 1 of 2   Next > >  
(రాణి కె.) చూడబోతే, భారతదేశంలో అభివృద్ధి రంగాల్లో సృజనాత్మకత చంక నాకిపోతున్నా ఆశ్చర్యం గొలిపే విధంగా సరికొత్త పద్ధతుల్లో నేరాలు, ఘోరాలు చేయటంలో మాత్రం ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయీకరణలో భాగంగా మన దేశంలో పెచ్చరిల్లిపోతున్న కన్సూమరిజానికీ, ప్రేమల పేరుతో జరుగుతున్న దాడులకీ ప్రత్యక్ష సంబంధమే ఉంది. వస్తువుల దగ్గర మొదలైన ఈ రెండు గుణాలు ప్రేమల దాకా పాకాయి. టీనేజ్ పిల్లల నుండి పాతికేళ్ల యువత వరకూ ప్రేమించిన వారి నుంచి తిరస్కారం పొందినవాళ్లు, విఫలమైన వాళ్లు ఘోరాలకు ఒడిగట్టటానికి కారణం మాత్రం వినిమయ మనస్తత్వం, పోటీ తత్వం .. ఈ రెంటికీ ప్రేమతో ముడిపెట్టి చూడడమే. కొద్ది కాలం క్రితం ప్రేమ విఫలమైనవాళ్ళు, తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఫీలైనవాళ్ళు వాటర్ ట్యాంకులూ, టెలిఫోన్ టవర్లూ ఎక్కి దూకుతామని బెదిరించేవాళ్లు అప్పట్లో ఆ ట్రెండ్ ఎక్కువగా నడిచింది. అయితే అవతలి వాళ్ల ప్రాణం తీసేదాకా ఈ ట్రెండ్ పోలేదు కాబట్టి కొంత వరకూ ఇది నయమనే చెప్పొచ్చు. వీరిలో నిజంగా దూకిన కేసులెన్ని అనేది వేరే ప్రశ్న. దీని తరువాత, ప్రేమను అంగీకరించలేదన్న అక్కసుతో అమ్మాయిల గొంతులు కోసి, హత్య చేసే పరిస్థితి కొంతకాలం నడిచింది. అది కూడా తరువాత పోయి యాసిడ్ దాడుల ట్రెండ్ మొదలైంది. తాజాగా హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఇంజెక్షన్లు చేసే పద్ధతి వచ్చిందన్న వార్తలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇది ఎన్ని రోజులు ఉంటుందో, దీని తర్వాత మరే కొత్త విధానం వస్తుందో! ఇలాంటి సంఘటనలు మరో రెండో మూడో జరిగితే వాటిలో ఏదో ఒకటి - ముఖ్యంగా అమ్మాయి కాస్త చూడచక్కగా ఉందనుకున్న కేసు, అదీ అధమం వాళ్లది అప్పర్ మిడిల్ క్లాసు అయితేనే - మీడియా పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అప్పుడు ఆంధ్రదేశమంతా కొన్నాళ్లు గగ్గోలు పెడుతుంది. ఇటువంటి కేసుల్లో పోలీసులు కొత్తగా ఆటవిక న్యాయం అమలు చేయటం మొదలుపెట్టారు కాబట్టి ఆ కేసు వెంటనే పరిష్కారమైపోవచ్చు. ఈలోగా దేశీయంగా అత్యంత ముఖ్యమైన మరో పరిణామమేదో సంభవిస్తుంది - అంటే ఐశ్వర్యారాయ్ నెల తప్పటం లాంటి వార్త ఏదో వస్తుందన్నమాట. దాంతో అందరి దృష్టీ అటు మళ్లిపోతుంది. అసలు సమస్య మాత్రం అక్కడే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కొన్నాళ్ళుగా ఎందుకింత ఎక్కువగా జరుగుతున్నాయంటే ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతారు. వయసు ఆకర్షణ గురించి పిల్లల్లో సరైన అవగాహన కల్పించని తల్లిదండ్రులదే తప్పనేవాళ్లు కొందరు. ఈ ఆకర్షణ పూర్వమూ ఉన్నదే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే తల్లిదండ్రులు ఇటువంటి విషయాల్లో పిల్లలతో ఎక్కువగా చర్చిస్తున్నారు. అయినా ఈ దారుణాలు మాత్రం పూర్వం కన్నా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి. దానర్ధం ఏమిటి? సినిమాలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పెట్రేగిన విచ్చలవిడి ధోరణులు దీనికి ఒక కారణం అనేది మరికొందరి సమాధానం. తల్లిదండ్రుల పెంపకం లోపం కన్నా ఇది అర్ధవంతమైన సమాధానం కావచ్చు. ఈ క్రమంలో మరో కారణం కూడా కనిపిస్తుంది.

Be first to comment on this Article!

  Page: 1 of 2   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training