అన్ని సద్గుణాలలో కెల్లా శ్రేష్టం దానం
భగవంతుడిచ్చిన సంపదలో కొంత భాగం
ఇతరులకు దానమివ్వడం పుణ్యప్రదం
గుప్త దానం బహు శ్రేష్టం
నిస్వార్ధ బుద్ధితో, మానవతా దృష్టితో
నిస్సహాయులు, నిరుపేదలకు దానమిచ్చి
వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు యత్నించడం
అత్యుత్తమమైన, పవిత్రమైన సాధనం
త్యాగబుద్ధి లేని దాన గుణం
స్వప్రయోజనాన్ని, అభున్నతిని కాంక్షించి
స్వార్ధ బుద్ధితో, పేరు ప్రఖ్యాతులు ఆశించి
ఒనరించు దానం నిష్ప్రయోజనం
భగవంతునికి అప్రియం, ఫలితం శూన్యం
|