ఏమవుతోందీ రాష్ట్రం? పెద్ద పెద్దోళ్ళ మాటల మూటలు బిగుసుకపోతున్నై. నోరు మెదపని ప్రజా ప్రభుత్వం తానా అంటే తందానా అనే రాష్ట్ర ప్రభుత్వం, తెరచిన నోరు మూయకుండా నాదాలు నినాదాలే మిగిలాయి. పాపం సామాన్య ప్రజానీకానికి చివరికి మిగిలింది మొండి చెయ్యే.
ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఊపిరాడని ప్రసంగాలే మిగిలాయి. సాధించిందేమిటి? కుమ్ములాటలు తప్ప.
స్తంభించిన ప్రజా జీవితం అలో లక్ష్మణా అంటోంది.
రెక్కాడితే కాని డొక్కాడని పేద బతుకుల మాటేంటి?
ఎవరు ఎవరు ఎవరు?
ఎవరు లబ్ధి పొందుతున్నారు?
రాజకీయ నాయకులా?
ప్రజా ప్రతినిధులా?
ప్రజా పీడితులా?
తప్పెవరిది? నీదా? నీదా? నీదా?